USలో తెలుగు యువకుడికి చిత్రహింసలు.. వైసీపీ లీడర్ సహా ఇద్దరు అరెస్ట్
YSRCP లీగల్ కోఆర్డినేటర్ గా చెప్పుకుంటున్న సత్తారు వెంకటేష్ రెడ్డిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. USలో మానవ అక్రమరవాణా, బానిసత్వం, హింసకు పాల్పడటం లాంటి కేసులు పెట్టారు సెయింట్ లూయిస్ పోలీసులు. ఇరవై ఏళ్ల తెలుగు యువకుడిని చదువు పేరుతో అమెరికాకు తెచ్చి.. తన ఇంట్లో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడు వెంకటేష్ రెడ్డి. చెప్పిన మాట వినకపోతే ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు.
YSRCP లీగల్ కోఆర్డినేటర్ గా చెప్పుకుంటున్న సత్తారు వెంకటేష్ రెడ్డిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. USలో మానవ అక్రమరవాణా, బానిసత్వం, హింసకు పాల్పడటం లాంటి కేసులు పెట్టారు సెయింట్ లూయిస్ పోలీసులు. ఇరవై ఏళ్ల తెలుగు యువకుడిని చదువు పేరుతో అమెరికాకు తెచ్చి.. తన ఇంట్లో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడు వెంకటేష్ రెడ్డి. చెప్పిన మాట వినకపోతే ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. రోజుకు కనీసం మూడు గంటలైనా నిద్ర పోనీయకుండా పని చేయించుకుంటున్నట్టు తేలింది. పదే పదే హింస పెడుతుండటంతో.. ఆ ఇరవై ఏళ్ల యువకుడు బాగా వీక్ అయ్యాడు. ఇతని పరిస్థితి చూసిన పొరుగు వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దాంతో సత్తారు వెంకటేష్ రెడ్డితో పాటు మరో ఇద్దర్ని అరెస్టు చేశారు. బాధితుడిని హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందిస్తున్నారు అమెరికా పోలీసులు.
Revanth Reddy : రేవంత్ రెడ్డి సీఎం అవుతాడా..? రియల్టర్లు, కాంట్రాక్టర్ల బేజార్..!
సెయింట్ చార్లెస్ కౌంటీలో ఓ ఇంట్లో యువకుడిని వేధిస్తున్నారని పోలీసులకు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లారు. మొదట పోలీసులను లోపలికి రానీయలేదు. తర్వాత బలవంతంగా వెళ్లి చూడటంతో యువకుడు దయనీయ స్థితిలో ఉన్నాడు. అతన్ని వెంటనే హాస్పిటల్ కు తరలించి.. ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు తెలుగు యువకులు పెన్మత్స శ్రవణ్, పెన్మత్స నిఖిల్ ని అరెస్టు చేశారు. బాధితుడి హింసలు పెట్టింది సత్తారు వెంకటేష్ రెడ్డిగా గుర్తించి.. అతడిని వేరే ఇంట్లో అరెస్టు చేశారు. ముగ్గుర్నీ జైలుకు తరలించారు అమెరికాలోని సెయింట్ లూయిస్ పోలీసులు.
బాధిత యువకుడిని చదిస్తానని చెప్పి అమెరికాకు తెచ్చి.. వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాడు సత్తారు వెంకటేష్ రెడ్డి. రోజులొ పాపం అతను నిద్రపోయేది 3 గంటలు మాత్రమే. సరిగా తిండి పెట్టేవాడు కాదు. ఇంట్లో నిర్మాణంలో ఉన్న బేస్మెంట్ ఏరియాలో.. కటిక నేల మీద పడుకోవాల్సిందే. అతడిపై ఎప్పుడూ సీసీ కెమెరా నిఘా ఉంటుంది. ఆ యువకుడు చేస్తున్న ప్రతి పనిలోనూ తప్పు వెతికి.. అతడిపై చేయిచేసుకునేవాడని పోలీసులు తెలిపారు. కరెంట్ షాక్ ఇవ్వడం, పీవీసీ పైపులు, మెటల్ రాడ్ తో కొడుతూ ఉండేవాడు. ఆ యువకుడికి అమెరికాలో ఎవరూ తెలియదు. పొరుగున ఓ వ్యక్తి అతని పరిస్థితి గమనించాడు. ఏమైనా సాయం కావాలంటే చెప్పాలని తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. తనను హింసిస్తున్నారని చెప్పడంతో.. అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అమెరికా పోలీసులు ఆ యువకుడికి హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. యువకుడి చేతులు, కాళ్ళు, పాదాల దగ్గర ఎముకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బరువు కూడా చాలా తగ్గిపోయి.. బలహీనంగా తయారయ్యాడు.
సత్తారు వెంకటేష్ రెడ్డిది ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండ. తాను వైసీపీ నేతననీ.. సీఎం జగన్ బంధువునీ ప్రచారం చేసుకుంటాడు. వైఎస్సార్ ఆసరా ఫౌండేషన్ కో-ఫౌండర్, వైసీపీ లీగల్ సెల్ స్టేట్ కోఆర్డినేటర్ అని అతని సోషల్ మీడియాలో రాసుకున్నాడు. వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొన్న వీడియోలను కూడా సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు.
తాడేపల్లిలో సీఎం జగన్ గృహప్రవేశ సమయంలో కూడా వెంకటేష్ రెడ్డి పాల్గొన్నట్టు వీడియోలు ఉన్నాయి. అలాగే ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డితోనూ వెంకటేష్ రెడ్డి దిగిన ఫోటోలు ఉన్నాయి. కానీ పొన్నవోలు మాత్రం అతని పేరు ఎప్పుడూ వినలేదనీ.. వైసీపీతో సంబంధాలు ఉన్నట్టు కూడా తెలియదని అన్నారు. ఈ ముగ్గురు నిందితులు దేశం వదిలి పారిపోయే అవకాశం ఉన్నందున వారి నుంచి బాండ్ కూడా తీసుకోలేదని అమెరికా పోలీసులు చెప్పారు.