దేశవ్యాప్తంగా భార్య బాధితులు పెరిగిపోతున్నారా ? కట్టుకున్న సతీమణుల వేధింపులు తట్టుకోలేక...పతుల బలవన్మరణాలకు పాల్పడుతున్నారా ? అతుల్ సుభాష్ అనే భార్యాబాధితుడి ఆత్మహత్య దేశవ్యాప్తంగా దుమారం రేపింది. కట్టుకున్న భార్య రాచిరంపాన పెడితే...భర్త పరిస్థితి ఎలా ఉంటుంది ? వేధింపులను నలుగురికి మగాడు చెప్పుకోగలడా ? శృతి మించుతున్న సతుల టార్చర్‌ను పతులు తట్టుకోలేకపోతున్నరా ? బతకడం కంటే బలవన్మరణమే బెస్ట్ అనుకుంటున్నారా ? నిన్న మొన్నటి వరకు ఏ పేపర్ చూసినా...ఏ వెబ్ సైట్ చూసినా...24గంటల ఛానల్ చూసినా...భార్యలను వేధించిన భర్తల గురించే వార్తలు కనిపించేవి. కొంతకాలంగా ట్రెండ్ మారుతోంది. మహిళలు మారిపోతున్నారు. ఇటు వాళ్లు అటవుతున్నారు. అటోళ్లు ఇటు అవుతున్నారు. భార్యలను వేధించే భర్తల కంటే...భర్తలను వేధించే భార్యలు పెరిగిపోతున్నారు. ఏడడుగులు వేసిన భర్తలకు...ఏడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. పతియే ప్రత్యక్ష దైవం అనుకునే కొందరు మహిళలు కాస్త...రాక్షసుల్లా మారిపోతున్నారు. కట్టుకున్న భర్తలకు నరకం అంటే ఎలా ఉంటుందో...తమలోని రాక్షసత్వం ఎలా ఉంటుందో కళ్లారా చూపిస్తున్నారు. భర్తను బానిసల్లా చూసే...భార్యలు పెరిగిపోతున్నారు. ఆస్తులు కోసం వేధించేవారు కొందరు...వివాహేతర సంబంధాలతో భర్తలను అడ్డు తొలగించుకునే ఇంకొందరు. ఇలా ఎంతో మందిని చూశాం...చూస్తున్నాం...భవిష్యత్‌లోను ఇవన్నీ రిపీట్ అవుతూనే ఉంటాయి. భార్య వేధింపులు తట్టుకోలేక బెంగుళూరు చెందిన టెకీ ఆత్మహత్య దేశవ్యాప్తంగా దుమారం రేపింది. బెంగళూరులోని ఓ ప్రవేటు సంస్థల జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న అతుల్ సుభాశ్...డిసెంబర్ 9న తన అపార్ట్మెంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 24 పేజీల ఆత్మహత్య లేఖ రాశాడు. గంటన్నర వీడియో అతుల్ రికార్డ్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యతో తాను అనుభవిస్తున్న మానసిక క్షోభకు సంబంధించి రాసిన లేఖను ఇ-మెయిల్ ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, తన కార్యాలయం అధికారులు, సిబ్బంది, కుటుంబసభ్యులకు పంపించారు. తాను సంపాదించే డబ్బు...తన శత్రువులను మరింత బలోపేతం చేస్తోందని వాపోయాడు. తన శత్రువులు...ఆ డబ్బును వాడుకొనే తనను నాశనం చేస్తున్నారని కన్నీంటి పర్యంతమయ్యాడు. అందుకే చచ్చిపోవాలని అనుకుంటున్నట్లు వీడియోలో చెప్పాడు అతుల్. అతుల్ భార్య నిఖితా సింఘానియా, ఆమె తల్లి నిషా, సోదరుడు అనురాగ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. అతుల్ సుభాష్ ఆత్మహత్య మరచిపోకముందే...ఢిల్లీలోనూ భార్య బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాపులర్ కేఫ్ వుడ్‌బాక్స్ యజమాని పునీత్ ఖురానా బలవనర్మణానికి పాల్పడ్డాడు. ఢిల్లీలోని కల్యాణ్ విహార్‌లోని తన నివాసంలో ఉరేసుకుకున్నాడు. పునీత్ ఖురానాకు...భార్య మానిక జగదీష్ పహ్వాకి మధ్య విడాకుల వివాదం నడుస్తోంది. భార్య వేధింపులతోనే పునీత్ ఆత్మహత్యకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. భార్య వేధింపులకు సంబంధించి 16 నిమిషాల ఫోన్‌కాల్ ఆడియో బయటపడింది. మానిక జగదీష్ ఎలా వేధించిందో చెబుతూ...54 నిమిషాల సెల్ఫ్ వీడియోను రికార్డ్ చేశాడు పునీత్ ఖురానా. ఈ రెండింటిని బయటపెట్టి మరీ సూసైడ్ చేసుకున్నాను. 2016లో పునీత్ ఖురానా, మానిక జగదీష్‌కు వివాహం అయింది. ఇద్దరు కలిసి వుడ్‌బాక్స్ కేఫ్‌ను ప్రారంభించారు. విడాకుల కేసు కోర్టులో ఉండటంతో...విడివిడిగా ఉంటున్నారు. కేఫ్ వ్యాపారంలో మాత్రం ఇద్దరూ భాగస్వాములుగానే కొనసాగుతున్నారు. వుడ్‌బాక్స్ కేఫ్ వ్యవహారంలో పునీత్ ఖురానా, మానిక జగదీష్ మధ్య వాదోపవాదాలు జరిగాయి. పునీత్ మరణం తర్వాత.. మానికతో జరిగిన జరిగిన ఫోన్ కాల్ సంభాషణ ఒకటి బయటకు వచ్చింది. వుడ్‌బాక్స్ కేఫ్ సంబంధించిన బకాయిల విషయంలో...మానిక కఠినంగా మాట్లాడింది. నికా పహ్వా, ఆమె సోదరి, తల్లిదండ్రులు మానసికంగా పునిత్‌ను హింసించినట్లు వీడియోల్లో చెప్పాడు. పునీత్ సోషల్ మీడియా ఖాతాను కూడా హ్యాక్ చేసి...గుర్తు తెలియని వ్యక్తులకు అసభ్య మేసేజ్‌లను పంపింది.[embed]https://www.youtube.com/watch?v=7uNYlaxW3SM[/embed]