Jammu and Kashmir Tourism : ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకాశ్మర్ లో పెరిగిన టూరిజం..
జమ్మూ కాశ్మీర్ భారతదేశానికి తలమానికం.. ఎప్పుడు ఉగ్రవాదుల దాడులు అట్టడుగు ప్రాంతం.. ప్రతి క్షణం భారత సైన్యంతో కాపు కాసే కాశ్మీర్ వీదులు.. పాకిస్థాన్ నుంచి భారత్ లోకి చొరబడే పాక్ టెర్రరిస్టుల అరాచక చర్యలు.. ఇవే కాకుండా.. భారత దేశంలో అతి సుందరమైన ప్రాంతాలలో జమ్ముకశ్మీర్ ది ఓ అగ్రస్థానం..
జమ్మూ కాశ్మీర్ భారతదేశానికి తలమానికం.. ఎప్పుడు ఉగ్రవాదుల దాడులు అట్టడుగు ప్రాంతం.. ప్రతి క్షణం భారత సైన్యంతో కాపు కాసే కాశ్మీర్ వీదులు.. పాకిస్థాన్ నుంచి భారత్ లోకి చొరబడే పాక్ టెర్రరిస్టుల అరాచక చర్యలు.. ఇవే కాకుండా.. భారత దేశంలో అతి సుందరమైన ప్రాంతాలలో జమ్ముకశ్మీర్ ది ఓ అగ్రస్థానం.. అక్కడి కొండలు, పచ్చని భూములు, హిమాలయ పర్వతాలు, లోయలు, 100 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతాలు.. లోయల్లో ప్రవహించే చీనాబ్, రావి, సట్లెజ్ నదుల.. శీతాకాలంలో కురిసే.. మంచు వర్షం.. ప్రకృతి రమణీయత ఇలా ఒకటా రెండా ఈ ప్రపంచానికే భూతల స్వర్గం జమ్మూ కాశ్మీర్.. అక్కడ పర్యటించే పర్యాటకలను చూపు తిప్పని వైనం.. ప్రతి ఒక్కరు ఒక్కసారైన జమ్ముకాశ్మీర్ లో పర్యటించాలని అక్కడి దాల్ లేక్ లో.. హిమాలయాలను చూసి బోటింగ్ చేయాలని ప్రతి టూరిస్ట్ కి ఒక డ్రిం డెస్టినేషన్ ఉంటుంది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ పర్యాటకం కొత్త పుంతలు తొక్కుతోంది. జమ్మూకశ్మీర్ లో టూరిజం పెరిగింది. ఆర్టికల్ 370 కి ముందు వరకు జమ్మూకశ్మీర్ వీదుల్లో సమాన్య ప్రజలు ప్రయాణాలు చేయాలంటే అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బిక్కు బిక్కు మంటు జీవనం గడిపేవారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్లమెంట్ లో ఆర్టికల్ 370 బిల్లు పాస్ అయ్యాక.. భారత దేశపు హిమాలయాల్లో విహరించడానికి అనువైన ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్, లే లడ్డఖ్ ప్రాంతాలు అతి ముఖ్యమైనవి. దీంతో ఈ ప్రదేశాలను సందర్శించడానికి దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బైక్ రైడర్స్, పర్యటకులు పర్యటిస్తున్నారు. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత 2023లో దాదాపు 2.11 కోట్ల మంది JKను విజిట్ చేశారు. దీంతో పర్యటకంలో 15.3% వార్షిక సగటు వృద్ధిరేటుతో ఈ రంగం ఎదుగుతోంది.
ఈ ఏడాది 2024 తొలి ఆర్నెల్లలో 1.08 కోట్ల మంది పర్యటించారని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభలో తెలిపారు. ఈ సంవత్సరం ముగిసేలోపు 2 కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉందని జమ్మూ టూరిజం అంచనా వేసింది. మరో వైపు JK టూరిజం ను మరింతగా పర్యటకులను ఆకర్షించేందు.. విజిటర్స్‌ను ఆకర్షించేందుకు సినిమా, హౌజ్‌బోట్ పాలసీలను ప్రవేశ పెడుతున్నారు. జమ్మూ కాశ్మీర్ కు వచ్చే పర్యాటకుల మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జమ్మూ టూరిజం కొత్త వూహాలను రచిస్తోంది.