Traffic Challans Last Date : ఇవాళ మిస్సయితే బాదుడే ! పెండింగ్ చలాన్లకు ఆఖరు
పెండింగ్ ట్రాఫిక్ చలానాలు ఉంటే ఇవాళే క్లియర్ చేసుకోండి. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన భారీ రాయితీలు ఇవాళ్టితో ముగుస్తున్నాయి. ఈ చలానాలను మీసేవ లేదంటే PayTM, UPI ద్వారా ఆన్ లైన్ లో కూడా చెల్లించవచ్చు.

తెలంగాణ సర్కార్ ప్రకటించిన పెండింగ్ చలానాల భారీ డిస్కౌంట్ ఇవాళ్టితో ముగుస్తోంది. డిసెంబర్ 26 జనవరి 10 దాకా పెండింగ్ చలానాలను డిస్కౌంట్ తో చెల్లించుకునే అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. అది ఇవాళ్టితో ముగుస్తోంది. అందుకే ఇంకా ఎవరైనా పెండింగ్ చలాన్లు ఉంటే చెల్లించాలని RTA అధికారులు, ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదంటున్నాలరు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు. ప్రభుత్వ రాయితీలు ఎలా ఉన్నాయంటే
ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లకు 90శాతం రాయితీ
బైక్ లపై 80శాతం తగ్గింపు ఇచ్చిన తెలంగాణ సర్కార్
ఫోర్ వీలర్స్, ఆటోలకు 60శాతం డిస్కౌంట్
ఇతర భారీ వాహనాలకు 50శాతం తగ్గింపు
మీరు చలానాలనాల మీసేవకి వెళ్ళి చెల్లించవచ్చు. లేదంటే… UPIతో, పేటీఎం ద్వారా కూడా ఆన్ లైన్ లో చలాన్లు చెల్లించే చాన్స్ ఉంది. ఇంత భారీ డిస్కౌంట్ ను ప్రభుత్వం మళ్ళీ ఇచ్చే అవకాశం లేదు. ఇవాళ మిస్ అయితే డిస్కౌంట్ వర్తించదంటున్నారు పోలీసులు…