Telangana Traffic Rules: రాంగ్‌రూట్‌లో వెళ్తున్నారా.. ఫైన్‌తోపాటు పోలీస్ కేసు, జైలు కూడా..
రూల్స్ పాటించని వాహనదారులు విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు డిసైడ్ అయ్యారు. అందులోనూ రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపే వాళ్లపై కొరడా ఝుళిపించబోతున్నారు.
Telangana Traffic Rules: మన దగ్గర ట్రాఫిక్ రూల్స్ పాటించే వాళ్లు చాలా తక్కువ. ట్రాఫిక్ రూల్స్‌పై ఎంతగా అవగాహన కల్పిస్తున్నా, చలాన్లు విధిస్తున్నా కొందరు జనాలు మారడం లేదు. రూల్స్ అతిక్రమించి వాహనాలు నడుపుతున్నారు. ప్రమాదాలకు కారణమవుతున్నారు. అందుకే.. ఇకపై ఇలా రూల్స్ పాటించని వాహనదారులు విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు డిసైడ్ అయ్యారు.
YS VIJAYAMMA: అమెరికా నుంచి విజయమ్మ సందేశం.. ఎమోషనల్ అయిన షర్మిల..
అందులోనూ రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపే వాళ్లపై కొరడా ఝుళిపించబోతున్నారు. కొందరు రాంగ్ రూట్‌లో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటివారిపై ట్రాఫిక్ పోలీసుల చలాన్లు విధిస్తున్నారు. కానీ, ఏదో ఆఫర్ వచ్చినప్పుడు తక్కువకే ట్రాఫిక్ చలాన్ విధించి తప్పించుకుంటున్నారు. కానీ, వాహనదారులు మాత్రం మారడం లేదు. అందుకే ఇకపై రాంగ్ రూట్‌లో వెళ్లే వారిపై ట్రాఫిక్ చలాన్ విధించి వదిలేయకుండా.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులు డిసైడయ్యారు. అలాంటివారిపై ఐపీసీ 336 కింద కేసు నమోదు చేస్తామంటున్నారు. ఈ అంశంపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్‌లు ప్రకటన చేశారు. దీంతో రాంగ్ రూట్‌లో వెళ్తే ఏం కాదని, అవసరమైతే ఫైన్ కట్టొచ్చులే అని సులువుగా తీసుకునేవారిపై ఇక మీదట ఐపీసీ 336 కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. శుక్రవారం నుంచే ఈ నిబంధనను అమలు చేస్తున్నారు.
ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని మియాపూర్ పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో రాంగ్ రూట్‌లో ప్రయాణించిన 23 వాహనదారులు, ఓ వాటర్ టాంకర్ డ్రైవర్ మీద స్థానిక పోలీస్ స్టేషన్‌లో 336 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈ వాహనదారులంతా ఇకపై నేరుగా కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ సెక్షన్ కింద తప్పు చేసినట్లు రుజువైతే.. మూడు నెలల జైలు శిక్ష కూడా పడే ప్రమాదం ఉంది. అయినప్పటికీ నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై అవసరమైతే మరిన్ని సెక్షన్లు నమోదు చేస్తామంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ముఖ్యంగా రాంగ్‌రూట్‌లో వాహనాలు నడిపి, పెద్ద ప్రమాదాలకు కారణమైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరిస్తున్నారు.