Shekhar Master : శేఖర్ మాస్టర్ ఇంట్లో విషాదం…
డాన్స్ మాస్టర్ శేఖర్ (Shekhar Master). టాలీవుడ్ (Tollywood) డాన్స్ లవర్స్‌కు ఇది పరిచయం అక్కర్లేని పేరు.

Tragedy at Shekhar Master's house...
డాన్స్ మాస్టర్ శేఖర్ (Shekhar Master). టాలీవుడ్ (Tollywood) డాన్స్ లవర్స్‌కు ఇది పరిచయం అక్కర్లేని పేరు. ఢీ షోలో (Dee Show) కంటెస్టెంట్ స్థాయి నుంచి టాప్ హీరోలకు కొరియోగ్రఫీ చేసే స్థాయికి ఎదిగిన ఆయన జీవితం చాలా మంది ఇన్స్‌పిరేషన్. హీరోలు వేసే స్టుప్పులు చూస్తే చాలా ఈ సాంగ్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడని చెప్పేస్తుంటారు ఆయన ఫ్యాన్స్. కొరియోగ్రఫీలో ఆయనకు ఉన్న మార్క్ అలాంటిది. ఇక ఢీ షోకి జడ్జ్‌గా వచ్చిన తరువాత శేఖర్ మాస్టర్ బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ప్రస్తుతం ఒకపక్క షోస్ మరోపక్క మూవీస్‌తో చాలా బిజీగా ఉన్నాడు. అలాంటి శేఖర్ మాస్టర్ ఇంట్లో ఓ విషాదం జరిగింది.
శేఖర్ మాస్టర్ వాళ్ల వదిన చనిపోయారు.
ఈ విషయాన్ని చెప్తూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘వదినా నిన్ను చాలా మిస్ అవుతున్నాం.. ఇంత బాధను భరించి ఇంకా బలంగా నిలబడ్డావు! మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావు.. ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించే మనస్తత్వాన్ని మేం మర్చిపోలేం. మీరు చనిపోయారనే విషయాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను.. మీరు ఇప్పుడు స్వర్గంలో ఉంటారని ఆశిస్తున్నాను.. మీరు ఎల్లప్పుడూ మాతోనే ఉంటారు.. ఓం శాంతి’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు శేఖర్ మాస్టర్. ఐతే ఆయన వదిన ఎలా చనిపోయారు అనే విషయాన్ని మాత్రం శేఖర్ మాస్టర్ చెప్పలేదు. ఈ పోస్ట్ చూసిన శేఖర్ మాస్టర్ ఫ్యాన్స్ ఆయనను ఓదారుస్తూ కామెంట్లు పెడుతున్నారు.