Nehru Zoo, white tiger : నెహ్రూ జూలో విషాదం.. తెల్ల పులి “అభిమన్యూ” మృతి..
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలో అరుదైన తెల్ల పులి మృతిచెందింది. 9 సంవత్సరాలు ఉన్న రాయల్ బెంగాల్ జాతికి చెందిన మగ తెల్లపులి మంగళవారం ( మే 14) ప్రాణాలు విడిచింది. కాగా బద్రి, సురేఖ అనే పులులకు 2015 జనవరి 2న ఈ పులి జన్మించింది. దీనికి అభిమన్యు అని పేరు పెట్టగా.. ప్రస్తుతం దాని వయస్సులో ఈ పులి మరణించింది.

Tragedy in Nehru Zoo.. white tiger "Abhimanyu" died..
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలో అరుదైన తెల్ల పులి మృతిచెందింది. 9 సంవత్సరాలు ఉన్న రాయల్ బెంగాల్ జాతికి చెందిన మగ తెల్లపులి మంగళవారం ( మే 14) ప్రాణాలు విడిచింది. కాగా బద్రి, సురేఖ అనే పులులకు 2015 జనవరి 2న ఈ పులి జన్మించింది. దీనికి అభిమన్యు అని పేరు పెట్టగా.. ప్రస్తుతం దాని వయస్సులో ఈ పులి మరణించింది. అయితే ‘అభిమన్యు’కు గతేడాది ఏప్రిల్‌లో ‘నెఫ్రిటీస్’ కిడ్నీ సంబంధమైన జబ్బు ఉన్నట్లు నెహ్రూ జూ అధికారులు గుర్తించారు. బెంగాల్ టైగర్ అభిమన్యు అనారోగ్యంతో మృతి చెందినట్లు జూపార్క్ సిబ్బంది వెల్లడించారు.
గతేడాది నుంచి ఆరోగ్యపరంగా బలహీనంగా ఉన్న అభిమన్యుకు గత కొన్నిరోజులుగా అన్ని రకాల వైద్యసేవలు అందించారు. ట్రీట్‌మెంట్ కోసం వీబీఆర్‌ఐ, వెటర్నరీ అధికారుల సూచనలు తీసుకున్నారు. ఈనెల 12 నుంచి అభిమన్యు ఆహారం తీసుకోవటం తగ్గించింది. గత మూడు రోజులుగా జూలోనే మందులతో పాటు ద్రవ ఆహారం అందిస్తూ చికిత్స కొనసాగించినా.. ఎలాంటి ఫలితం లేకపోయిందని జూపార్క్ అధికారులు వెల్లడించారు.
అభిమన్యూ మరణంకు కారణం.. దాన్ని రెండు కిడ్నీలు పూర్తిగా పాడైపోవడంతో ప్రాణాలు కోల్పోయింది. పోస్టుమార్టం నివేదికలో మూత్రపిండాలు పాడైపోయినట్లు తేలిందని నెహ్రూ జూపార్క్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం జూలో మొత్తం పులులు 18 ఉండగా.. అందులో తెల్ల పులులు 8 ఉన్నాయి.