Uma Ramanan : తమిళ్ సినీ ఇండస్ట్రీలో విషాదం.. గాయని ఉమా రామనన్ కన్నుమూత..
తమిళనాడు సినీ ఇండస్ట్రీలో (Tamil Film Industry) తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ గాయని ఉమా రమణన్ (Uma Ramanan) (72) బుధవారం కన్నుమూశారు.

Tragedy in the Tamil film industry.. Singer Uma Ramanan passed away..
తమిళనాడు సినీ ఇండస్ట్రీలో (Tamil Film Industry) తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ గాయని ఉమా రమణన్ (Uma Ramanan) (72) బుధవారం కన్నుమూశారు. ఆమె సినీ ప్రయాణం 1976లో ‘ప్లే బాయ్’ అనే హిందీ చిత్రంతో ప్రారంభమైంది. శాస్త్రీయ సంగీత కళాకారిణి అయిన ఉమా 35ఏళ్లలో 6 వేలకుపైగా ప్రదర్శనలు ఇచ్చారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సహా విద్యాసాగర్, మణిశర్మ, దేవా తదితరులకూ పనిచేశారు.
మహానది, ఒరు కైథియన్ డైరీ, అరంగేట్ర వేళై మొదలైన ఎన్నో చిత్రాలకు గాత్రం అందించారు. తెలుగులో చివరగా ‘ఓ చిన్నదాన’లో ‘దిర..’ అనే పాటను ఆలపించారు. అనారోగ్యమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆమె మృతి చెందడం పట్ల ఇండస్ట్రీ వర్గాల వారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఉమా మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
SSM