Kevvu Karthik : జబర్దస్త్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం…
జబర్దస్త్ (Jabardasth) టీవీషో (TV Show) లో ప్రముఖ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కెవ్వు కార్తీక్ ఇంట విషాదం చోటు చేసుకుంది.

Tragedy of Jabardast Kevvu Karthik's house...
జబర్దస్త్ (Jabardasth) టీవీషో (TV Show) లో ప్రముఖ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కెవ్వు కార్తీక్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి క్యాన్సర్‌తో పోరాడుతూ చివరికి బుధవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయమై కార్తీక్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. క్యాన్సరే (Cancer) భయపడే విధంగా తన తల్లి క్యాన్సర్‌తో పోరాటం చేసిందన్నారు.
జబర్దస్త్ కార్యక్రమం ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు కెవ్వు కార్తీక్ (Kevvu Karthik) ఒకరు. ఈ ప్రోగ్రాం ద్వారా వచ్చిన గుర్తింపుతో అనేక స్టేజ్ షోలు, ఈవెంట్లలో తన ప్రతిభ ప్రదర్శిస్తూ.. ఆడియెన్స్‌కు దగ్గరయ్యాడు. ఈ క్రమంలో తాజాగా కార్తీక్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కార్తీక్ తల్లి కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో పొరాడుతున్న కార్తీక్ తల్లి.. కన్నుమూశారు. ఈ సందర్భంగా కార్తీక్ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా కార్తీక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తల్లిని గుర్తు చేసుకుంటూ.. ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘‘అమ్మా గత 5 సంవత్సరాల 2 నెలలు గా క్యాన్సరే భయపడే విధంగా ఆ మహమ్మారిపై అలుపెరుగని పోరాటం చేశావ్. నీ జీవితం అంతా యుద్ధమే. మమ్మల్ని కన్నావు.. నాన్నకి తోడుగా ఉంటూ.. కష్టాల్లో కూడా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడావ్. అమ్మా ఈ 5 సంవత్సరాల నుండి ఒంటరిగా ఎలా పోరాడాలో నాకు నేర్పావు. నీ ఆత్మస్థైర్యం నాలో ధైర్యాన్ని నింపింది. అన్నీ నేర్పావు కానీ నువ్వు లేకుండా ఎలా బతకాలో మాత్రం నేర్పలేదు ఎందుకు అమ్మా.. మా అమ్మ కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. మా అమ్మకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ అందరికీ నా పాదాభివందనం’’ అంటూ కెవ్వు కార్తిక్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఇది చూసిన అభిమానులు, తోటి నటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ధైర్యంగా ఉండమని కామెంట్స్ చేస్తున్నారు.