Telangana New collectors : తెలంగాణలో 20 మంది ఐఏఎస్‌ల బదిలీ.. 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లు..
తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల (IAS) బదిలీ జరిగింది. 20 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Transfer of 20 IAS in Telangana.. New collectors for 12 districts..
తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల (IAS) బదిలీ జరిగింది. 20 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం కలెక్టర్‌గా ముజిమిల్ ఖాన్, నాగర్‌కర్నూల్ కలెక్టర్‌గా సంతోష్, భూపాలపల్లి కలెక్టర్‌గా రాహుల్‌శర్మ, కరీంనగర్ కలెక్టర్‌గా అనురాగ్ జయంతి బదిలీ అయ్యారు. కొత్తగా ఈ జిల్లాలకు ఐఏఎస్ లను నియమించారు. పెద్దపల్లి కలెక్టర్‌గా కోయ శ్రీహర్ష, నాగర్ కర్నూల్ కలెక్టర్‌గా బదావత్ సంతోశ్, సిరిసిల్ల కలెక్టర్‌గా సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ కలెక్టర్‌గా అనురాగ్ జయంతి, నారాయణపేట కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్, భద్రాద్రి కలెక్టర్‌గా జితేశ్ వి పాటిల్ నియమితులయ్యారు.
తెలంగాణ జిల్లాలకు కొత్త కలెక్టర్లు
కామారెడ్డి: ఆశిశ్ సంఘ్‌వాన్
హనుమకొండ: ప్రావిణ్య
జగిత్యాల : సత్య ప్రసాద్
మహబూబ్ : విజయేంద్ర బోయి
మంచిర్యాల : కుమార్ దీపక్
వికారాబాద్ : ప్రతిక్ జైన్
నల్గొండ : నారాయణ రెడ్డి
వనపర్తి : ఆదర్శ్ సురభి
సూర్యాపేట : తేజస్ నందలాల్ పవార్
వరంగల్ : సత్య శారదా దేవి
ములుగు : టీఎస్ దివాకరా
నిర్మల్ : అభిలాష అభినవ్