Telangana, IAS : తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ల బదిలీ.. రవాణా ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ గా వికాస్ రాజ్…
తెలంగాణ రాష్ట్రంలో మరో సారి ఐఏఎస్ బదిలీ జరిగింది. తెలంగాణ (Telangana) నుంచి సుమారుగా 8 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో మరో సారి ఐఏఎస్ బదిలీ జరిగింది. తెలంగాణ (Telangana) నుంచి సుమారుగా 8 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని శాఖల్లో ప్రక్షాళన చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్ (Revanth Reddy Sarkar).. ఇందులో భాగంగానే నేడు 8 మంది ఐఏఎస్ (IAS) అధికారులను ట్రాన్స్ ఫర్ చేసింది. మరో పైపు వికాస్ రాజ్ (Vikas Raj) ను స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ప్రభుత్వం తిరిగి నియమించింది. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టి.కే.శ్రీదేవిని ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. రిజ్వీకి వాణిజ పన్నుల శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. విపత్తుల నిర్వహణ విభాగం సంయుక్త కార్యదర్శిగా ఎస్. హరీశ్‌కు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఉదయ్ కుమార్‌కు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. పురపాలక శాఖ ఉప కార్యదర్శిగా ప్రియాంక, హెచ్ఎసీఏ ఎండీగా చంద్రశేఖర్ రెడ్డి, మార్క్‌ఫెడ్ ఎండీగా శ్రీనివాస్ రెడ్డిలను ప్రభుత్వం నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
- 8 మంది ఐఏఎస్‌లు…
* ఎస్సీ అభివృద్ధిశాఖ కమిషనర్- టీకే శ్రీదేవి
* మునిసిపల్‌శాఖ ఉపకార్యదర్శి- ప్రియాంక
* HMDA ఎండీ- చంద్రశేఖర్ రెడ్డి
* మార్క్‌ఫెడ్ ఎండీ- శ్రీనివాస్ రెడ్డి
* విపత్తుల నిర్వహణ విభాగం సంయుక్త కార్యదర్శి- S.హరీశ్
* వాణిజ్య పన్నులశాఖ కమిషనర్- రిజ్వీ(అదనపు బాధ్యతలు)
* మార్కెటింగ్ శాఖ డైరెక్టర్- ఉదయ్ కుమార్(అదనపు బాధ్యతలు)
* రవాణా ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ గా వికాస్ రాజ్…