IPS officers : తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీ.. పూర్తి వివరాలు

తెలంగాణలో కొత్త డీజీపీగా జితేందర్‌ను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ రవి గుప్తా స్థానంలో 1992 క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ జితేందర్‌ను తెలంగాణ డీజీపీగా నియమించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 11, 2024 | 01:30 PMLast Updated on: Jul 11, 2024 | 1:30 PM

Transfer Of Ips Officers In Telangana Full Details

 

 

తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ శాఖల్లో గత ప్రభుత్వం లో ఉన్న అధికారులన తొలగించడం.. ఉన్న స్థాలన నుంచి వివిధ జిల్లాలకు బదిలీ చేయడం జరుగుతునే ఉన్నాయి. కాగా మరో సారి తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ జరిగాయి. ఒకేసారి 15 మంది ఐపీఎస్ అధికారులను మరో చోటకు బదిలీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక తెలంగాణ కు కొత్త DGP ని నియమించింది రేవంత్ సర్కర్…

గతంలో రాచకొండ కమిషనర్‌గా ఉన్న మహేష్ భగవత్‌ను లా అండ్ అడిషనల్ డీజీగా నియమించింది. ప్రస్తుత రాచకొండ కమిషనర్ తరుణ్ జోషిని ఏసీబీకి బదిలీ చేసింది. వరంగల్ సీపీగా ఉన్న సుధీర్ బాబును రాచకొండ సీపీగా పదోన్నతి కల్పించింది.

☛ హోంగార్డ్స్ అడిషనల్ డీజీగా స్వాతి లక్రా..
☛ టీజీఎస్పీ బెటాలియన్ అడిషనల్ డీజీగా సంజయ్ కుమార్ జైన్..
☛ గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీగా స్టీఫెన్ రవీంద్ర..
☛ రాచకొండ కమిషనర్‌గా సుధీర్ బాబు..
☛ ఏసీబీ డైరెక్టర్‌గా తరుణ్ జోషి..
☛మల్టీ జోన్ 1 ఐజీగా చంద్రశేఖర్ రెడ్డి..
☛ రైల్వే, రోడ్ సేఫ్టీ ఐజీగా రమేష్ నాయుడు..
☛ మల్టీ మల్టీజోన్ 2 ఐజీగా సత్యనారాయణ..
☛ హైదరాబాద్ సీఆర్ హెడ్ కోటర్ డీసీపీగా రక్షితమూర్తి..
☛ మెదక్ ఎస్పీగా డి.ఉదయ్ కుమార్ రెడ్డి..
☛ వనపర్తి ఎస్పీగా గిరిధర్..
☛ ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామి..
☛ సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా చంద్రమోహన్..

తెలంగాణలో కొత్త డీజీపీగా జితేందర్‌ను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ రవి గుప్తా స్థానంలో 1992 క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ జితేందర్‌ను తెలంగాణ డీజీపీగా నియమించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. ఒకవైపు ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సమయంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి నేరుగా అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కలిశారు. ఈ ఘటనలో కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహించి.. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన నేపథ్యంలో అప్పటి తెలంగాణ డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ ను ట్రాన్సవర్ మీదు వేరే శాఖలకు పంపించింది ఎన్నికల కమిషన్.. తెలంగాణలో ఒక సంవత్సరంలో ఇద్దరు డీజీపీ మారరం ఇదే తొలిసారి.