Trendsetters: చిరు, బాలయ్య, షారుఖ్ ఖాన్ అందిరిదీ ఒకే మాట.. ట్రెండ్ మారింది.. !
టాలీవుడ్, కోలీవుడ్ కి మాత్రమే రిజర్వ్ అనుకున్న హిట్ ఫార్ములాని బాలీవుడ్ కూడా పట్టేసింది. పఠాన్ హిట్ తో మాస్ ఫార్ములాకు తిరుగులేదని తేలింది. నిజంగానే తెలుగులో చిరు మూవీ వాల్తేర్ వీరయ్య 300 కోట్లకు దగ్గర్లో ఉంది. బాలయ్య వీరసింహారెడ్డి వసూల్ల వరదతో మాస్ జోనర్ కి ఇది కలిసొచ్చే కాలమని..!
సరే టాలీవుడ్ లో చిరు, బాలయ్య, కోలీవుడ్ లో విజయ్, అజిత్, బాలీవు్డ లో షారుఖ్ అంతా మాస్ రూట్లో 2023 కి హిట్స్ తో వెల్ కమ్ చెప్పారు. జనవరి లో వసూళ్ల వరదతెచ్చేందుకు బరిలో దిగారు. మరి ఫిబ్రవరి బోణీ ఎవరిది..?
శాకుంతలం నుంచి అమిగో, సర్, వరకు అన్నీ మీడియం రేంజ్ మూవీలు. లేదంటే క్లాస్ కి కాస్త దగ్గరగా ఉండే కహానీలు.. నాని దసరా, సందీప్ కిషన్ మైఖేల్ తప్ప మరేవి మాస్ మతిపోగొట్టే మూవీల్లాలేవు.. సో ఇవి హిట్టై మిగతా వాటికి కాలం కలిసి రాకపోతే, 2023 మాస్ నామ సంవత్సరమే అనుకోవాల్సి వస్తుంది.. ప్రజెంట్ సిచ్చువేషన్ చూస్తే మాస్ ఫార్ములాకే కాలం కలిసొస్తున్నట్టుంది.