Tripura, HIV : త్రిపుర రాష్ట్రా విద్యార్థులకు హెచ్‌ఐవీ.. 47 మంది మృతి.. ఎందుకో తెలిస్తే షాక్..?

త్రిపుర‌లో హెచ్ఐవి క‌ల‌క‌లం సృష్టిస్తోంది. త్రిపుర రాష్ట్రంలో‎ ఇప్పటి వరకు 47 మంది విద్యార్థులు HIVతో మృతి చెందారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 6, 2024 | 05:15 PMLast Updated on: Jul 06, 2024 | 5:15 PM

Tripura State Students Hiv 47 People Died Shock To Know Why

త్రిపుర‌లో హెచ్ఐవి క‌ల‌క‌లం సృష్టిస్తోంది. త్రిపుర రాష్ట్రంలో‎ ఇప్పటి వరకు 47 మంది విద్యార్థులు HIVతో మృతి చెందారు. ఇప్పటివరకు 828 మంది విద్యార్థులను HIV పాజిటివ్‌గా గుర్తించామని త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(TSACS) సీనియర్ అధికారి తెలిపారు. 828 మంది HIV పాజిటివ్‌ విద్యార్థుల్లో 572 మంది బతికే ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో మొత్తంగా హెచ్ఐవితో బాధ‌ప‌డుతున్న‌వారి సంఖ్య 5,674గా ఉంద‌న్నారు. వీరిలో 4,570 మంది పురుషులు, 1,103 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండ‌ర్ ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. త్రిపుర రాష్ట్ర వ్యాప్తంగా యువత డ్రగ్స్ బానిసలు అవుతుండటంతో ఇటీవలే స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్‌ సొసైటీ అధికారులు 220 పాఠశాలలు, 24 కాలేజీలు, యూనివర్సిటీల్లో అధ్యయనం చేపట్టారు.

త్రిపుర రాష్ట్రంలో విద్యార్థులు భారీగా డ్రగ్స్‌ ఇంజక్షన్స్‌ తీసుకుంటున్నట్లుగా గుర్తించారు. అయితే, హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న వ్యక్తులు తీసుకున్న ఇంజక్షన్ మరొకరు వాడుతుండటంతో ప్రతిరోజు 5 నుంచి 7 కొత్త హెచ్‌ఐవీ పాజిటివ్ కేసులు నమోదు అయినట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా 47 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులోను సంపన్న కుటుంబాల విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నార‌ని తెలిపారు. త్రిపుర జర్నలిస్ట్ యూనియన్, వెబ్ మీడియా ఫోరమ్, టిఎస్ఏసిఎస్ ఇటీవల సంయుక్తంగా నిర్వ‌హించిన‌ మీడియా వర్క్ షాప్‌లో ఈ పెరుగుతున్న కేసులు తెచ్చారు.