Trisha: మరోసారి త్రిష పెళ్లి దుమారం..
కెరియర్ సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ తనదైన దూకుడు ప్రదర్శిస్తూ కుర్రకారును ఆకర్షిస్తోన్న త్రిష పెళ్లి పీటలెక్కబోతుందా.

Trisha Love With Malayalam Moive Producer Marring Soon
త్రిష పెళ్లి పై ఇప్పటికే రకరకాల పుకార్లు షికార్ చేశాయి. కానీ వాటిలో ఏది నిజం కాలేదు. 40 ప్లస్ లో కూడా తన జోరు తగ్గడం లేదు. అయితే తాజాగా త్రిష పెళ్లికి సంంబంధించి ఓ రూమార్ చక్కర్లు కొడుతోంది.ఈ ఏడాదిలో ఒక ఇంటి ఇల్లాలు అవడానికి చెన్నై చంద్రం రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. త్రిషకు ఈ మధ్యే 40 ఏళ్లు నిండాయి. ఈ వయసులో హీరోయిన్ వేషాలు పక్కన పెట్టి.. క్యారెక్టర్ రోల్స్ చేసుకోవాలి. కానీ ఏజ్ భార్ స్టేజ్ లో కూడా చెక్కు చెదరని అందంతో ఆడియన్స్ ని థ్రిల్ చేస్తోంది. 96 మూవీతో బౌన్స్ బ్యాక్ అయిన ఈ చెన్నై బ్యూటీ పొన్నియన్ సెల్వన్ సీరిస్ తో హిట్ కొట్టింది. ప్రజెంట్ మలయాళంలో రెండు, తమిళంలో మూడు సినిమాలు చేస్తున్న త్రిష ఇప్పుడు పెళ్లి పై మనసు పారేసుకుందట. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుందట.
మలయాళంలో స్టార్ నిర్మాతగా కొనసాగుతున్న వ్యక్తితో త్రిష లవ్ లో పడిందట. త్వరలో ఈ విషయం బయటపెట్టి సదరు నిర్మాతతో పెళ్లి పీటలెక్కనుందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివర్లో త్రిష పెళ్లి ఘనంగా జరిగే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే 2015లో వరుణ్ మణియన్ అనే బిజినెస్ మ్యాన్ తో త్రిష కు నిశ్చితార్థం జరిగింది. కానీ తర్వాత విబేధాలు రావడంతో పెళ్లి చేసుకోలేదు. మరి ఇప్పుడు వస్తున్న రూమర్స్ నిజమా కాదా అని తెలియాలంటే త్రిష నుంచి క్రేజీ అప్డేట్ రావాల్సిందే.