TS CONSTABLE: తెలంగాణ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఉద్యోగాల నియామకాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఇప్పటికే పరీక్షలు పూర్తి కాగా.. ఈ పరీక్షల్లో ప్రశ్నలు తప్పుగా వచ్చాయంటూ కొందరు అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించారు. పరీక్షల్లో 4 మార్కులు కలపాలంటూ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన సింగిల్‌ బెంచ్‌ వాళ్లకు అనుకూలంగా తీర్పునిచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 4, 2024 | 05:03 PMLast Updated on: Jan 04, 2024 | 5:04 PM

Ts High Court Gives Green Signal To Appoint Ts Constable Jobs

TS CONSTABLE: తెలంగాణలో కానిస్టేబుల్‌ నియామకాలకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. మొన్నటి వరకూ కోర్టులో ఉన్న వివాదానికి తెలంగాణ హైకోర్ట్‌ ముగింపు పలికింది. ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో త్వరలోనే 15 వేల 640 కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ కానున్నాయి. ఇప్పటికే పరీక్షలు పూర్తి కాగా.. ఈ పరీక్షల్లో ప్రశ్నలు తప్పుగా వచ్చాయంటూ కొందరు అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించారు. పరీక్షల్లో 4 మార్కులు కలపాలంటూ పిటిషన్‌ వేశారు.

REVANTH REDDY: మహిళలకు రేవంత్‌ శుభవార్త.. రూ.2500 అప్పటి నుంచే..

ఈ పిటిషన్‌ను పరిశీలించిన సింగిల్‌ బెంచ్‌ వాళ్లకు అనుకూలంగా తీర్పునిచ్చింది. 4 మార్కులు కలపాలంటూ ఆదేశించింది. అయితే ఈ తీర్పును సెలక్ట్‌ ఐన అభ్యర్థులు తప్పుబట్టారు. సింగిల్‌ బెంచ్‌ తీర్పునకు వ్యతిరేకంగా పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషన్‌ను డివిజన్‌ బెంచ్‌ స్వీకరించింది. వ్యవహారం కోర్టులో ఉండటంతో నియామకాలకు అప్పట్లో బ్రేక్‌ పడింది. ఈ పిటిషన్‌ను ఇప్పుడు విచారించిన డివిజన్‌ బెంచ్‌.. సింగిల్‌ బెంచ్‌ తీర్పును తప్పుబట్టింది. మార్కులు కలపాల్సిన అవసరం లేదంటూ చెప్పింది. పరీక్షల్లో తప్పులు దొర్లాయన్న విషయంలో ఎక్స్‌పర్ట్‌ కమిటీతో విచారణ చేయించాలని నిర్ణయించింది. దీనికోసం త్వరలోనే కమిటీ ఏర్పాటు కానుంది.

విచారణ పూర్తయ్యాక 4 వారాల్లో ఉద్యోగాల భర్తీని పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో హోల్డ్‌లో ఉన్న ఉద్యోగాలన్నీ ఇప్పుడు భర్తీ కానున్నాయి. తెలంగాణ హైకోర్ట్‌ తీర్పుపై కానిస్టేబుల్‌కు సెలెక్ట్‌ ఐన అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.