TS Inter Results: ఇంటర్‌ రిజల్ట్స్‌ విడుదల.. ఫలితాలు చెక్‌ చేసుకోండిలా..

తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థుల తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్‌ రిజల్ట్‌ విడుదలయ్యాయి. ఇంటర్‌ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాల‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 9, 2023 | 01:30 PMLast Updated on: May 09, 2023 | 1:30 PM

Ts Inter Results Release

హైదరాబాద్‌ నాంపల్లిలోని ఇంటర్మీడియట్‌ కార్యాలయం నుంచి ఫలితాలను వెల్లడించారు. రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 5 వరకు నిర్వహించిన ఇంటర్‌ పరీక్షలకు మొత్తం 9.47 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫ‌స్టియ‌ర్ 4,33,082 మంది హాజ‌రైతే 2,72,208 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫ‌స్టియ‌ర్‌లో 62.85 శాతం ఉత్తీర్ణత న‌మోదైంది. సెకండియ‌ర్‌లో 3,80,920 మంది హాజ‌రైతే 2,56,241 మంది ఉత్తీర్ణత సాధించ‌గా, 67.27 శాతం ఉత్తీర్ణత న‌మోదైంది.

మొత్తం ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియర్‌లో 61.68 శాతం ఉత్తీర్ణత న‌మోదైంది. గర్ల్స్‌ 68.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాయ్స్‌ 54.66 శాతం ఉత్తీర్ణత సాధించారు. వెబ్‌సైట్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి. అన్నీ చెక్‌ చేసి పర్ఫెక్ట్‌ ఉన్నాయి అనుకున్న తరువాతే రిజల్ట్స్‌విడుదల చేశామన్నారు. ముందు ట్రయల్‌ రన్‌ నిర్వహించి అన్ని టెక్నికల్‌ గ్లిచ్‌లను సెట్‌చేశామన్నారు. విద్యార్థులు ప్రశాంతంగా వాళ్ల రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవచ్చన్నారు. హై స్కోరింగ్ సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.