TS RTC good news : కార్తీక మాసం లో తెలుగు రాష్ట్రాల ప్రజలకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త..
కార్తీక మాసం వచ్చింది అంటే చాలు తెలుగు రాష్ట్రాల ప్రజలు పుణ్యక్షేత్రాలకు క్యూ కడుతుంటారు. కార్తీక మాస్ తెలుగు సంవర్సరంలో ఎనిమిదోవ నెల. అన్ని నెలల్లో కల్ల కార్తీక మాసం అనగా ఈ నెల అతి పవిత్రమైన నెలగా తెలుగు ప్రజలు పరిగనిస్తారు.
కార్తీక మాసం వచ్చింది అంటే చాలు తెలుగు రాష్ట్రాల ప్రజలు పుణ్యక్షేత్రాలకు క్యూ కడుతుంటారు. కార్తీక మాస్ తెలుగు సంవర్సరంలో ఎనిమిదోవ నెల. అన్ని నెలల్లో కల్ల కార్తీక మాసం అనగా ఈ నెల అతి పవిత్రమైన నెలగా తెలుగు ప్రజలు పరిగనిస్తారు. ఈ కార్తీక మాసంలో శివుడిని.. విష్ణువుని తెలుగు ప్రజలు ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ మాసంలో పూణ్యక్షేత్రాలు దర్శించాలి అని చాలా కోరికతో భక్తులు క్యూ కడుతుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ ప్రాచీన ఆలయాలు అన్ని రద్దిగా మారుతాయి.
అలా ఎన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించాలి అంటే రవాణా సౌకర్యం కావాలి.. అందుకే టీఎస్ ఆర్టీసీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల భక్తులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ఏపీలో ఏ ఆలయాలకు బస్సులు నడపనున్నారు తెలుసా..?
ఏపీలోని అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, పాలకొల్లు, సామర్లకోట పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ బస్సులు ప్రతి ఆదివారం, కార్తీక పౌర్ణమి ముందు రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి నగరానికి చేరుకుంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. టిక్కెట్ ఛార్జీలు రాజధాని రూ.4 వేలు, సూపర్ లగ్జరీ రూ.3200. దర్శనం, వసతి కోసం రూ.550 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు.
తెలంగాణ ఏ ఆలయాలకు బస్సులు నడపనున్నారు తెలుసా..?
తెలంగాణలో వేములవాడ, కాళేశ్వరం, రామప్పగుడి, వెయ్యి స్తంభాల గుడి, పాలకుర్తి తదితర దక్కన్ పంచశైవ క్షేత్రాలకు బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సర్వీసులు ప్రతి ఆదివారం, కార్తిక పౌర్ణమి ముందురోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి దర్శనం అనంతరం సోమవారం రాత్రికి నగరానికి చేరుకుంటాయన్నారు. టిక్కెట్ ఛార్జీలు రాజధాని రూ.2400, సూపర్‌లగ్జరీ రూ.1900, ఎక్స్‌ప్రెస్ రూ.1500గా ఉంటుందని ఆర్టీసీ తెలిపింది.
కాగా, ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ అనేక కొత్త కొత్త సేవలు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇటీవలే జనరల్ బస్సు పాసులను అందుబాటులోకి తీసుకురాగా, దసరా, రాఖీపౌర్ణమి సందర్భంగా మహిళలకు లక్కీ డ్రా నిర్వహించింది టీఎస్ ఆర్టీసీ. ఆర్టీసీని ప్రజలకు ప్రతి క్షణం అందుబాటులో ఉంచి అవసంర అయిన మేరకు ఆర్టీసీ సేవలు ప్రజలు వినియోగించుకునేలా ఆర్టీసీ యాజమన్యం ప్రయత్నిస్తుంది. దీంతో ప్రయాణికులు ఎక్కువగా ఆర్టీసీ వైపే మొగ్గు చూపుతున్నారు.
ఇక ఇదే తరహాలో ప్రయాణికుల రద్దీని దక్షణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తుంది. ఇక దీపావళి పండుగ సందర్భంగా ద.మ రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. 12, 14, 19, 21 తేదీల్లో.. సికింద్రాబాద్ – రాక్సోల్, నిజామాబాద్ – నాందేడ్ మీదుగా జనసాధారణ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ నుంచి రాక్సోల్ (రైలు నెం. 07007)కు ఈ నెల 12, 19 తేదీల్లో ఉదయం 10:30కు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో రక్సాల్ నుంచి సికింద్రాబాద్ (07008) కు 14, 21 తేదీల్లో వస్తాయి. ఈ రైళ్లలో 22 అన్ రిజర్వ్‌డ్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉన్నాయని చెప్పారు. దాదాపు 2,400 మంది కూర్చుని ప్రయాణించే వెసులుబాటు కలిగి ఉంటుందని తెలిపారు. సికింద్రాబాద్ నుంచి కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముద్ఖేడ్ , నాందేడ్, పూర్ణ తదితర తక్కువ దూరం ప్రయాణించే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయని వెల్లడించారు.
ఈ స్టేషన్లలో స్టాపులు
ఈ రైళ్లకు బొల్లారం, మేడ్చల్, అకోలా, ఖాండ్వా , ఇటార్సీ, పిపారియా, జబల్పూర్, కాట్ని, సత్నా, మాణీకపూర్, ప్రయాగ్‌రాజ్, ఛోకీ పండిట్, డీడీ ఉపాధ్యాయ, బౌక్సర్, అరా, పాటలీపుత్ర, అక్కన్నపేట్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ, బాస్మత్, హింగోలి దక్కన్, వాషిం, హాజీపూర్, ముజఫర్‌పూర్, సీతామర్హి జంక్షన్ స్టేషన్లలో రెండు వైపులా ప్రయాణాల్లో స్టాప్ ఉందని అధికారులు తెలిపారు. అయితే, సికింద్రాబాద్ వంటి పెద్ద స్టేషన్లలో రద్దీని దృష్టిలో పెట్టుకుని యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా టికెట్లు తీసుకోవాలని ద.మ.రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ సూచించారు.