TS RTC New Buses :  తెలంగాణ ఆర్టీసీకి కొత్త బస్సులు… !

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చాక మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టింది.  మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో బస్సులన్నీ మహిళలతో రద్దీగా మారాయి. ఆక్యుపెన్సీ పెరగడం, పురుషులకు కూర్చోడానికి సీట్లు కూడా లేకపోవడంతో టీఎస్ ఆర్టీసీ కొత్త బస్సులను తీసుకొస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 29, 2023 | 06:20 PMLast Updated on: Dec 29, 2023 | 6:20 PM

Ts Rtc New Buses

TS RTC Buses:  తెలంగాణ ఆర్టీసీకి 80 కొత్త బస్సులు వస్తున్నాయి.  రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వీటిని శనివారం నాడు ప్రారంభించబోతున్నారు.  హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.  రూ.400 కోట్ల ఖర్చుతో 1050 కొత్త డీజిల్ బస్సులను కూడా కొంటామని అధికారులు చెబుతున్నారు. వీటిల్లో 400 ఎక్స్ ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులు ఉంటాయి.  పర్యావరణ హితంగా ఎలక్ట్రిక్ వాహనాలను కూడా హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సులను వినియోగంలోకి తెస్తారు.  శనివారం నుంచి కొత్తగా వస్తున్న 80 బస్సుల్లో 30 ఎక్స్ ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లాహరి స్లీపర్ కమ్ సీటర్ (నాన్ ఏసీ) బస్సులు ఉన్నాయి.