TSPSC: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీ ఖరారు చేసిన టీఎస్‌పీఎస్సీ

పాత గ్రూప్-1 నోటిఫికేషన్‌ రద్దు చేసిన టీఎస్‌పీఎస్సీ.. ఇటీవల 563 ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 26, 2024 | 09:25 PMLast Updated on: Feb 26, 2024 | 9:25 PM

Tspsc Announced Group 1 Prelims Exam Date

TSPSC: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్-1 పరీక్షలపై సోమవారం కీలక ప్రకటన చేసింది. ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీలను ఖరారు చేసింది. జూన్‌ 9న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించించింది. పాత గ్రూప్-1 నోటిఫికేషన్‌ రద్దు చేసిన టీఎస్‌పీఎస్సీ.. ఇటీవల 563 ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

YS SHARMILA: మద్యపాన నిషేధం అని చెప్పి నాసిరకం మద్యం అమ్ముతారా.. జగన్‌పై షర్మిల ఫైర్

దీనికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల తేదీల గురించి ఆలోచిస్తున్న అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ తాజాగా తీపికబురు అందించింది. వచ్చే జూన్‌ 9న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించబోతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ఆ ప్రకారం పరీక్ష తర్వాత కొద్ది రోజుల్లోనే ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడిస్తారు. ఇక సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు.