TSPSC: అలర్ట్.. గ్రూప్స్ పరీక్ష తేదీల షెడ్యూల్ ఖరారు..

గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షల షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్‌సీ సెక్రెటరీ బుధవారం విడుదల చేశారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల తేదీలు ఇలా ఉన్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 6, 2024 | 03:59 PMLast Updated on: Mar 06, 2024 | 4:10 PM

Tspsc Released Group Exams Shedule Starts From

TSPSC: తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌పీఎస్‌సీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్రూప్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షల షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్‌సీ సెక్రెటరీ బుధవారం విడుదల చేశారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల తేదీలు ఇలా ఉన్నాయి.

Jr NTR-YSRCP: ఎన్టీఆర్‌ను ఆయుధంగా మార్చుకుంటున్న వైసీపీ.. కొడాలి నాని మాటలకు అర్థం అదేనా..

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 9న నిర్వహిస్తారు. ఆ తర్వాత గ్రూప్-1 మెయిన్స్, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలు జరుగుతాయి. గ్రూప్-2 పరీక్షలు వచ్చే ఆగష్టు 7, 8 తేదీల్లో, గ్రూప్-3 పరీక్షలు నవంబర్ 17, 18 తేదీల్లో జరుగుతాయి. ఇక గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు 21, అక్టోబర్ 2024 నుంచి ప్రారంభమవుతాయి. ఇప్పటికే 563 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. గ్రూప్-2లో 783 పోస్టులు, గ్రూప్-3లో 1388 పోస్టులున్నాయి. ప్రస్తుతం ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. పరీక్ష పేపర్లు, ఇతర వివరాల కోసం టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్ సంప్రదించాలి.