TSRTC: టీఎస్‌ఆర్టీసీ సరికొత్త ప్లాన్.. ఇక అందరికీ సీట్లు..
కొన్ని ప్రాంతాల్లో మగవాళ్లకు ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసింది టీఎస్‌ఆర్టీసీ. ఇక అన్ని బస్సుల్లో దాదాపుగా మహిళా ప్రయాణికులే ఎక్కువగా ఉన్నా.. వాళ్లకు కూడా గొడవలు జరుగుతున్నాయి. ఇబ్బందికరంగా మారిన సీట్ల వ్యవహారాన్ని సెట్ చేసేందుకు టీఎస్‌ఆర్టీసీ సరికొత్త ప్లాన్ వేసింది.
TSRTC: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలోని మహిళలందరికీ వయసుతో సంబంధం లేకుండా ఫ్రీ బస్ ఇవ్వడంతో ఆర్టీసీలో ప్రయాణాల సంఖ్య భారీగా పెరిగింది. ఏ ఊర్లో చూసినా ఆర్టీసీ బస్సుల్లో మహిళలే కనిపిస్తున్నారు. దీంతో తమకు సీట్లు దొరకడంలేదంటూ మగవాళ్లు గొడవలు చేస్తున్నారు. టికెట్ కొనుక్కుని కూడా నిలబడి ప్రయాణాలు చేయాల్సి వస్తోందని ఆందోళనలు కూడా చేస్తున్నారు.
PAWAN KALYAN: టీడీపీ, జనసేన కూటమిదే అధికారం.. పార్టీ కోసం రూ.10 కోట్లు విరాళం: పవన్ కళ్యాణ్
కొన్ని ప్రాంతాల్లో మగవాళ్లకు ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసింది టీఎస్‌ఆర్టీసీ. ఇక అన్ని బస్సుల్లో దాదాపుగా మహిళా ప్రయాణికులే ఎక్కువగా ఉన్నా.. వాళ్లకు కూడా గొడవలు జరుగుతున్నాయి. సీట్ల కోసం చాలా ప్రాంతాల్లో చాలా మంది మహిళలు గొడవపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా ఇబ్బందికరంగా మారిన సీట్ల వ్యవహారాన్ని సెట్ చేసేందుకు టీఎస్‌ఆర్టీసీ సరికొత్త ప్లాన్ వేసింది. బస్‌లలో సీటింగ్ సిస్టంను మార్చబోతోంది. రెగ్యులర్‌గా ఉండే సీట్లు కాకుండా ఇలా మెట్రో మోడల్‌లో ఉండే సీట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. సీట్లు ఇలా ఉంటే కూర్చునేవాళ్లతో పాటు.. నిలబడి వెళ్లే ప్రయాణుకులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎక్కువ మంది బస్‌లో ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇలాంటి సీటింగ్‌ను మెట్రో ట్రైన్స్‌లో ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఇదే మోడల్ సీటింగ్‌ను టీఎస్‌ఆర్టీసీ బస్సులో కూడా తీసుకురావాలని ప్రయత్నిస్తోంది టీఎస్‌ఆర్టీసీ.
ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసింది. త్వరలోనే ఇలాంటి సీటింగ్ టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో కనిపించబోతోంది. ఈ సీటింగ్ వచ్చాకైనా పురుషులకు సీట్లు దొరుకుతాయా.. మహిళలు సీట్ల కోసం కొట్టుకోవడం మానేస్తారా అనేది చూడాలి.