Tirumala: చిరుతల బారి నుంచి భక్తులను కాపాడేందుకు టీటీడీ కీలక నిర్ణయం..
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం టీటీటీ కీలక నిర్ణయం తీసుకుంది. నడక మార్గంలో అడవికి ఇరువైపులా ఇనుప కంచెను ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తోంది.

TTD ready to install iron fences on Tirumala Walkway to protect it from leopards
తిరుమల స్వామి వారి దర్శనానికి నిత్యం లక్షల మంది భక్తులు కొండపైకి వస్తూ ఉంటారు. అందులో నడటమార్గం గుండా వచ్చేందుకు ఎక్కువ మంది సుముఖత చూపిస్తారు. సెలబ్రిటీ మొదలు సామాన్యుడి వరకూ అందరూ నడకమార్గాన్నే ఎంచుకోవడం గతంలో చాలా సార్లు చూశాం. అయితే అలిపిరి, శ్రీవారి మొట్టు మార్గాల్లో చిరుతలు సంచరిస్తుండటంతో టీటీడీ తాజాగా ఒక నిర్ణయాన్ని తీసుకుంది. తిరుమల నడక మార్గంలో ఇనుప కంచెను ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది.
తిరుమల మెట్ల మార్గంలో చిరుతలు ఎక్కువగా సంచరిస్తున్నాయి. గతంలో ఒక చిన్నారిని పొట్టన పెట్టుకుంది. అలాగే మరోకరిపై దాడికి ప్రయత్నించింది. అయితే అతనికి తృటిలో ముప్పు తప్పిందని చెప్పాలి. ఈ పరిస్థితులన్నీ పర్యవేక్షించిన టీటీడీ ఉన్నతాధికారులు కంచె ఏర్పాటు కు రంగం సిద్దం చేశారు. కొండకు ఇరువైపులా అడవి మార్గం ఎక్కువగా ఉండే చోట ఇనుప కంచెలు ఏర్పాటు చేసేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు తప్పనిసరి. అయితే ఇప్పటికే ఇనుప కంచె ఏర్పాటుకు కేంద్ర అనుమతులు కోరింది టిటిడి.
తిరుమల తిరుపతి దేవస్థానం అభ్యర్థన మేరకు త్వరలోనే ఎక్స్ ఫర్ట్స్ కమిటి నడకమార్గంలో పర్యటించి నివేదికన అందజేసే అవకాశం ఉంది. నివేదిక అందిన వెంటనే దాని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్దంగా ఉంది. ఇప్పటికే ఐదు చిరుతలను దేవస్థానం సిబ్బందితో కలిసి ఫారెస్ట్ అధికారులు బంధించారు.మరో మూడు చిరుతల సంచారాని ట్రాప్ కెమరాల ద్వారా గుర్తిస్తున్నారు. స్పెషల్ టైప్ క్వార్టర్స్, శ్రీవారి మెట్టు నడకదారి, అలిపిరి నరశింహస్వామి ఆలయ సమిపంలో చిరుతలు సంచరిస్తూన్నట్లు గుర్తించారు.
T.V.SRIKAR