Tuvalu country : యాభై ఏళ్లలో అదృశ్యం కానున్న దేశం.. ఎక్కడో తెలుసా ?

ఈ భూమిపై.. అతి చిన్న దేశాలు, విచిత్రమైన దేశాలు, ఇసుక దేశాలు, మంచు దేశాలు ఇలా ప్రత్యేక ఉంటే చాలా ప్రపంచ పర్యటాకులు ఇక్కడికి ఎగేసుకుంటు పోయి అక్కడి విచిత్రలాను కళ్లారు చూసి వస్తుంటారు. ఇది నిత్యం మనం చూస్తునే ఉంటాం. నిత్యం జరుగుతుంది కూడా. మారి దేశానికి మాత్రం ప్రపంచ పర్యాటక ప్రదేశాలతో పోలిస్తే ఇక్కడికి వచ్చే పర్యాటకుల శాతం చాలా అంటే చాలా తక్కువ అని.. పర్యాటకంలో అత్యంత వెనుకబడిన దేశంగా ఐక్యరాజ్య సమితి ఇటీవల ప్రకటించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 8, 2023 | 02:38 PMLast Updated on: Oct 08, 2023 | 2:38 PM

Tuvalu Is A Country That Will Disappear In Fifty Years Rising Pacific Ocean Water Table Will Drown The Country

ఈ భూమండలంపై ఎన్నో ప్రదేశాలు, ఎన్నో దేశాలు కొన్ని ఏళ్ల నాటి క్రితం ఏర్పాడ్డాయి.. అవి భూమి మీద కావచ్చు సముద్రంలో కావచ్చు.. కాలం మారుతున్న కొద్ది పర్యవరణంలో కొద్ది పాటు మార్పులు చోటు చేసుకుంటున్నాయి.. మారీ ఈ కాలంలో అయితే వాతవరణ మార్పులు మరింత వేగంగా చోటు చేసుకుంటున్నాయి. అలా ఎన్నో ప్రదేశాలు వాతావరణ మార్పులకు లోనై కాలగర్భంలో కలిసిపోయాయి.. మరి కొన్ని కలిసిపోతున్నాయి.. వాటిలో ఈ దేశం కూడా మొదటి స్థానంలో ఉంది.
తువాలు దేశంకు పర్యావరణంతో భారీ ముప్పు వాటిల్లుతుంది. మరో యాభై ఏళ్లలో ఆ దేశం ఉనికిలో ఉండకపోవచ్చు.. పూర్తిగా సముద్రంలో మునిగిపోవచ్చు.. ఇప్పటికే ఆ దేశం క్రమంగా సముద్రంలోకి కుంగిపోతోంది. మనం ఇంతవరకు ద్వీవులు మునగడం చూశాం.. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏకంగా ఓ దేశమే సముద్రంలో మునగడం చూస్తాం.. ఆ దేశం ఏమిటి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఆ దేశం ఎక్కడ ఉంది..?

తువాలు దేశం దక్షిణ పసిఫిక్ సముద్రంలో 9 చిన్న చిన్న ద్వీపాల సముదాయం కలయికతో ఏర్పాడిన ఓ చిన్న ద్వీపం ఈ తువాలు దేశం. ఈ ప్రదేశం ఆస్ట్రేలియా, హవాయి ల మధ్య తువాలు దేశం ఉంటుంది. తువాలు దేశం ఫునాఫుటి రాజధానిగా చేసుకొని 11,900 మంది జనాభాతో 26 చ.కి.మీ విస్తీర్ణంలో ఈ దేశం ఉంటుంది. ఈ దేశానికి ఒక విమానాశ్రయం కూడా ఉంది. వారానికి మూడు విమానాలు మాత్రమే తువాలు దేశం నుంచి రాకపోకలు జరుగుతాయి. విమానాల రాకపోకలు లేని సమయంలో పిల్లలు రన్ వే మీద ఆటలాడుకుంటూ కనిపిస్తారు.

పసిఫిక్ సముద్రంలో మునుగుతున్న దేశం..!

ఈ భూమిపై.. అతి చిన్న దేశాలు, విచిత్రమైన దేశాలు, ఇసుక దేశాలు, మంచు దేశాలు ఇలా ప్రత్యేక ఉంటే చాలా ప్రపంచ పర్యటాకులు ఇక్కడికి ఎగేసుకుంటు పోయి అక్కడి విచిత్రలాను కళ్లారు చూసి వస్తుంటారు. ఇది నిత్యం మనం చూస్తునే ఉంటాం. నిత్యం జరుగుతుంది కూడా. మారి దేశానికి మాత్రం ప్రపంచ పర్యాటక ప్రదేశాలతో పోలిస్తే ఇక్కడికి వచ్చే పర్యాటకుల శాతం చాలా అంటే చాలా తక్కువ అని.. పర్యాటకంలో అత్యంత వెనుకబడిన దేశంగా ఐక్యరాజ్య సమితి ఇటీవల ప్రకటించింది. తువాలును ఏటా సందర్శించే పర్యాటకులు సగటున 3,700 మంది మాత్రమే.. ! ఈ దేశంలో హోటళ్లు, రెస్టారెంట్ల సంఖ్య కూడా తక్కువే విచిత్రమైనప్రదేశాలను చూడాలనుకునే ఉబలాటం ఉన్నవారు తప్ప వినోదయాత్రల కోసం పర్యటనకు వెళ్లే వారు ఎవరూ దేశంవైపు కన్నెత్తి కూడా చూడరు. ఈ దేశంలోని ప్రధాన ద్వీపం అయిన ఫునాఫుటి రాజధానిలో మనుషులు నివసిస్తుంటారు. ఈ దేశం మొత్తం తిరిగిన మీకు ఒక ఏటీఎం కూడా ఉండదు. ఒకవేళ డబ్బు కావాలంటే పర్యటకులు సైతం బ్యాంకుకు వెళ్లాల్సిందే..! దీని బట్టి అంటే అర్థం చేసుకోండి ఈ దేశం ఎంత చిన్నదో. దేశం మొత్తంలో ఏటీఎం లేని దేశం రికార్డు కోట్టేసింది తువాలు దేశం.

పెరుగుతున్న సముద్ర మట్టం.. మునుగుతున్న తువాలు దేశం..!

ఈ భూమిపై మానవ తప్పుల వల్ల వాతావరణ మార్పులు జరుగుతున్నాయి. దీంతో ఆ ప్రభావంతో సముద్రాల్లో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.అలా పెరుగుతున్న సముద్ర జలాలతో ఈ దేశం చుట్టుపక్కల చిన్న చిన్న ద్వీపాలు సముద్రంలో మునిగిపోతున్నాయి. ఇలా సముద్ర జలాల్లోకి క్రమంగా జారుకుంటున్న దేశం తువాలు మొదటి స్థానంలో ఉందని చేప్పవచ్చు. మరికొన్ని సంవత్సరంలో ఆ దేశం మనకు కనిపించదు.. పసిఫిక్ సముద్రంలో తువాలు ద్వీపం అంతర్ భాగమవుతుంది. భవిష్యత్తు తరాలకు ఇక్కడ ఓ దేశం ఉండేదని చెప్పాల్సిన పరిస్థితి తలెత్తింది. గూల్ మ్యాప్ నుంచి తన ఈ దేశం ఉనికి కనిపించదు. ప్రపంచ పటంలో తుని ఆనవాలు కూడా ఉండవు అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వాతవరణ మార్పుల వల్ల తువాలు దేశ రాజధాని ఫునాఫుటి 40% సముద్రంలో నీట మునిగింది. ఈ శతాబ్దం చివరినాటికి అనగా మరో 50 సంవత్సరాలు ఈ దేశం పూర్తిగా
పసిఫిక్ మహా సముద్రంలో మునిగిపోతుంది.

మానవ తప్పిదం వల్ల.. నా దేశ మనుగడ కనుమరుగు..!

తన దేశానికి ఈ పరిస్థితికి రావడానికి తన భావోద్వేగంతో ప్రపంచ దేశాలకు తువాలు దేశ విదేశాంగ మంత్రి సైమన్ కొఫె విమర్శలు గుప్పించారు. ప్రపంచ పర్యావరణ, వాతావరణ మార్పులకు కారణమవుతున్న.. చర్యలపై ప్రపంచదేశాల అధినేతలు ఐక్యరాజ్యసమితి విఫలమయ్యాయని.. కేవలం వారి మాటల చెప్పేందుకే తప్పు.. నిజానికి పర్యావరణం మార్పులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచా చేస్తున్న తప్పుకు ముందుగా మాదేశం కనుమరుగు అవుతుందని అగ్రదేశాదినేతలకు తన భావోద్వేగం వినిపించారు.

S.SURESH