TVK chief Vijay Dalapathy : నీట్ పరీక్షల పై TVK చీఫ్, నటుడు విజయ్ సంచలన వ్యాఖ్యలు.. నీట్ పరీక్ష రద్దు చేయండి : విజయ్ దళపతి
దేశంలో ఇటీవలే నీట్ ప్రశ్నపత్రాల లీక్ పై తమిళ్ సినీ నటుడు రాజకీయ నేత విజయ్ దళపతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే దేశంలో నీట్ పరీక్షలు జరుగుతున్న వేళ.. నీట్‌లో అక్రమాలు జరిగిన విషయం తెలిసిందే..

TVK chief, actor Vijay's sensational comments on NEET exams.. Cancel NEET exam Vijay Dalapathy
దేశంలో ఇటీవలే నీట్ ప్రశ్నపత్రాల లీక్ పై తమిళ్ సినీ నటుడు రాజకీయ నేత విజయ్ దళపతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే దేశంలో నీట్ పరీక్షలు జరుగుతున్న వేళ.. నీట్‌లో అక్రమాలు జరిగిన విషయం తెలిసిందే.. ఈ ప్రశ్నపత్రాల లీక్ పై తమిళగ వెట్రి కళగం పార్టీ (TVK) చీఫ్, నటుడు విజయ్.. ఈ దేశానికి నీట్ ఎగ్జామ్ అవసరం లేదు అన్నారు. ‘ప్రజలు నీట్‌పై నమ్మకాన్ని కోల్పోయారు. నీట్ పరీక్ష రద్దు చేయాలని ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం సీఎం స్టాలిన్ సర్కరు అసెంబ్లీలో పాస్ చేసిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నా.. మా పార్టీ ఆ తీర్మానాన్నికి మద్దతిస్తున్నామని తెలిపారు. నీట్ పరీక్ష వల్ల దేశంలో చాలా మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నీట్ పరీక్ష కారణంగా తమిళనాడులో పెద్ద సంఖ్యలో పేద, అర్హులైన, అట్టడుగున ఉన్న విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించలేకపోతున్నారు’ అని విజయ్ అన్నారు. ఇంటర్మీడియట్, పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులతో విజయ్ భేటీ అయిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజల ఎమోషన్లతో ఆడుకోవద్దని కేంద్రానికి నా విజ్ఞప్తి.. విద్యను ఉమ్మడి(కేంద్రం, రాష్ట్రం) జాబితా నుంచి రాష్ట్ర జాబితాలో చేర్చాలి’ రాజ్యాంగాన్ని సవరించాలని పార్టీ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.
#ThalapathyVIJAY’s full speech regarding NEET issue
#VijayFelicitatesStudents @actorvijay pic.twitter.com/GrPWAjJkyd
— Actor Vijay Fans (@Actor_Vijay) July 3, 2024