Raj Tarun : రాజ్‌తరుణ్‌ లవ్‌ఎఫైర్‌ కేసులో ట్విస్ట్‌.. అసలు ఈ లావణ్య ఎవరంటే..

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్... వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆ మధ్య ఆయన ప్రేయసి డ్రగ్స్ కేసులో చిక్కుకుంది. ఆ తర్వాత ఆ కేసులో రాజ్‌తరుణ్ పేరు వినిపించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 6, 2024 | 09:36 AMLast Updated on: Jul 06, 2024 | 9:36 AM

Twist In Rajtaruns Love Affair Case Who Is This Lavanya

 

 

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్… వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆ మధ్య ఆయన ప్రేయసి డ్రగ్స్ కేసులో చిక్కుకుంది. ఆ తర్వాత ఆ కేసులో రాజ్‌తరుణ్ పేరు వినిపించింది. ఇప్పుడు మళ్లీ లవ్ ఎఫైర్ వ్యవహారంలో.. హీరో చుట్టూ కొత్త వివాదం చేరింది. ఇక్కడ హైలైట్ ఏంటంటే.. అప్పుడు డ్రగ్స్‌ కేసులో దొరికిన యువతి.. ఇప్పుడు రాజ్‌తరుణ్‌ మోసం చేశాడని పీఎస్ మెట్లు ఎక్కిన యువతి ఒక్కరే.. ఆమె పేరే లావణ్య. దీంతో ఇప్పుడు లావణ్య ఎవరు.. రాజ్‌తరుణ్‌తో పరిచయం ఎలా అయింది. నిజంగా ఆమెను హీరో మోసం చేశాడా.. లేదంటే నాటకాలు ఆడుతోంది. అసలు లావణ్య బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటి అనే చర్చ జరుగుతోంది.

ప్రేమ పేరుతో రాజ్‌తరుణ్‌ తనను మోసం చేశాడని.. నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో లావణ్య కంప్లైంట్ చేసింది. తామిద్దరం 11ఏళ్లుగా రిలేషిన్ షిప్‌లో ఉన్నామని.. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని ఫిర్యాదులో రాసింది. ఐతే ఇంతలోనే మరొక హీరోయిన్‌తో రాజ్ తరుణ్‌కు పరిచయం అయిందని.. ఆమె మోజులో పడి రాజ్ తరుణ్ తనని వదిలేసి వెళ్లిపోయడాని కంప్లైంట్‌లో తెలిపింది. లావణ్య ఫిర్యాదుపై రాజ్‌తరుణ్‌ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఆమెతో ఒకప్పుడు రిలేషన్‌షిప్‌లో ఉన్న మాట నిజమేనని.. ఐతే ప్రస్తుతం తాము కలిసి లేమని చెప్పాడు. మస్తాన్‌ సాయి అనే వేరే వ్యక్తితో లావణ్య ప్రస్తుతం రిలేషన్‌లో ఉందని.. డ్రగ్స్‌కు బానిసై డబ్బుల కోసం తనను బ్లాక్‌మెయిల్ చేస్తోందని రాజ్‌తరుణ్‌ కౌంటర్ ఇచ్చారు.

దీంతో ఇద్దరిలో ఎవరిది నిజం అనే చర్చ జరుగుతోంది. ఐతే రాజ్‌తరుణ్‌ మీద కంప్లైంట్ ఇచ్చిన లావణ్య.. గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి.. 45రోజులు జైల్లో ఉంది. లావణ్య ఒక మ్యూజిషియన్. 2011లో రాజ్‌తరుణ్‌తో ఆమెకు పరిచయం అయింది. హీరోగా సినిమాల్లోకి రాకముందే రాజ్‌తరుణ్‌తో లావణ్యకు పరిచయం ఉంది. ఆ పరిచయం కాస్త తర్వాత ప్రేమగా మారింది. దాదాపు 11ఏళ్లుగా వీరిద్దరూ లివింగ్ రిలిషన్ ఉన్నారని.. తనని రాజ్‌తరుణ్‌ గుళ్లో పెళ్లి చేసుకున్నాడని లావణ్య ఆరోపణలు చేసింది. దీంతో ఇప్పుడు లావణ్య పేరు వివాదాల్లోకి వచ్చింది. గతంలో వరలక్ష్మీ టిఫిన్స్‌ అధినేతపై నమోదైన డ్రగ్స్‌ కేసులోనూ లావణ్య పేరు బయటకు వచ్చింది.