Nipah Virus: భారత్‌లో నిఫా వైరస్ కలకలం.. ఇద్దరు మృతి.!
కేరళలో నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. దీంతో ఆరోగ్యశాఖ మంత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
దేశంలో మరోసారి నిఫా వైరస్ పంజా విసురుతోంది. తాజాగా కేరళలో నిఫా వైరస్ సోకి ఇద్దరు మృతిచెందడం ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో, కేరళలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ కారణంగా మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చారు.
స్థానిక వైద్యులు అందించిన వివరాల ప్రకారం.. కేరళలో మరోసారి నిఫా వైరస్ ప్రబలుతోంది. ఈ వైరస్ సోకడంతో ఇన్‌ఫెక్షన్ కారణంగా కోజికోడ్ జిల్లాలో ఇద్దరు మృతిచెందినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేరళ హెల్త్ డిపార్ట్‌మెంట్ అప్రమత్తమైంది. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఉన్నత స్థాయి అధికారుల సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నిఫా వైరస్ కారణంగా ఇద్దరు మరణించారని తెలిపారు. ఇంకా ఎంతమందికి ఈ వ్యాధి సోకిందో యుద్దప్రాతిపదికన గుర్తించాలన్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులన్నీ అలర్ట్ గా ఉండాలని సూచించారు. దీనికి కారణాలను కనుగొని అందరికీ ప్రబలకుండా ఉండేలా ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
నిఫా వైరస్ ఎలా సోకుతుంది..
నిఫా వైరస్ అనేది ఒక వైరస్. ఈ వ్యాధి గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుంది. ఎప్పుడైతే గబ్బిలాలు పామ్ చెట్లపై ఉండి ఆ పండ్లను తింటాయో వాటిని మనుషులు తినడం, తాకడం, ఆ గాలి సోకినా కూడా మన శరీరంలోకి వైరస్ సోకుతుంది. వ్యాధి నిరోధక శక్తి ఉన్న వారిలో దీని ప్రభావం ఎక్కువగా కనిపించదు. సాధారణంగా దీనిని ఫ్రూట్ బ్యాట్ అంటారు. ఒక జీవి తన ద్వారా వ్యాధిని విస్తరించేందుకు దేనినైనా ఒక దానిని వాహకాలుగా మార్చుకుంటే దానిని ఫ్రూట్ బ్యాట్ అంటారు. అంటే దీనిని వైరస్ లను నిలువ చేసే ఆయుధాలు, కారకాలు, స్థావరాలు ఇలా రకరకాలుగా చెప్పవచ్చు. ఇది జంతువుల ద్వారా సోకే జోనోటిక్ డిసీస్. ఈ వ్యాధి సోకిన వారికి వారం నుంచి రెండు వారాల వరకూ వ్యాధి తీవ్రత శరీరంలో ఉంటుంది. సరైన చికిత్స తీసుకుంటే క్రమక్రమంగా తగ్గిపోయే అవకాశం ఉంది అంటున్నారు వైద్య నిపుణులు.
లక్షణాలు..
- కొందరిలో ఎలాంటి లక్షణాలు పైకి కనిపించకపోవచ్చు
- మరి కొందరిలో తీవ్ర జ్వరం
- లేవలేనంతగా ఒళ్ళు నొప్పులు
- దగ్గు – గొంతునొప్పి
- శ్వాస తీసుకోవడంలో సమస్య
- ఫిట్స్ రావడం
- మెదడు నరాలు పనిచేయకపోవడం
- ఉన్న పళంగా సృహ కోల్పోవడం
- ఒక్కోసారి వ్యాధి ముదిరి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది
T.V.SRIKAR