Typhoon Michoung : బాపట్ల వద్ద తీరాన్ని తాకిన మిచౌంగ్ తుఫాన్.. అల్లకల్లోలంగా మారిన సముద్రతీరం.. ఎగసిపడుతున్న రాకాశి అలలు
అల్ల కల్లోలంగా మారుతున్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు అర్ధరాత్రి కల్లా తీరానికి చేరుతుంది వాతావరణం వెల్లడించినా.. కాస్త ముందుగానే మిచౌంగ్ తుఫాన్ బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. మిచౌంగ్ తుఫాన్ పూర్తిగా తీరాన్ని తాకేందుకు ఇంకా గంట సమయం పడుతుంది. కాగా మిచౌంగ్ తుఫాన్ తీరాన్ని దాటే ప్రక్రియ మరో మూడు నుండి నాలుగు గంటలు పట్టే అవకాశం ఉంది.
అల్ల కల్లోలంగా మారుతున్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు అర్ధరాత్రి కల్లా తీరానికి చేరుతుంది వాతావరణం వెల్లడించినా.. కాస్త ముందుగానే మిచౌంగ్ తుఫాన్ బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. మిచౌంగ్ తుఫాన్ పూర్తిగా తీరాన్ని తాకేందుకు ఇంకా గంట సమయం పడుతుంది. కాగా మిచౌంగ్ తుఫాన్ తీరాన్ని దాటే ప్రక్రియ మరో మూడు నుండి నాలుగు గంటలు పట్టే అవకాశం ఉంది. తుఫాన్ తీరం దాటిన తర్వాత 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికాలు జారీ చేసింది. కాగా బాపట్ల వద్ద మిచౌంగ్ తుఫాన్ తీరం దాటడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. అటు సముద్రంలో రాకాసి అలలు 2 మీటర్ల మేర ఎగసిపడుతున్నాయి.
SURIYA-KARTHI: సూర్య, కార్తీ ఉదారత.. తమిళనాడు తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం
ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో నెల్లూరు, కావలి మధ్య తీరాన్ని తాకిన మిచౌంగ్ తుఫాన్.. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బాపట్ల, చీరాల మధ్య తీరాన్ని దాటింది. ఇందులో తుఫాన్ తీరం దాటే సమయంలో ఎవరు కూడా దాని పరిసర ప్రాంతాల్లో కూడా ఉండకూడదు.. తుఫాను తీరం దాటుతున్నప్పుడు.. 90 నుంచి 110 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ గాలులకు పెద్ద పెద్ద చెట్టు సైతం నేలకు ఓరిగించే శక్తి ఉంటుంది. సముద్ర తీరానికి 10 కిలోమీటర్ల పరిధిలోని వందల సంఖ్యలో పూరి గుడిసెలు కూలిపోయాయి. ఇక జాతీయ రాహదారులపై ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోయాయి. దీంతో ఏపీ ప్రభుత్వం అత్యవసర సర్వీసులు తప్ప అన్ని రవాణ సేవలను నిలిపివేసింది. మరో వైపు మచిలీపట్నం నుంచి చెన్నై వరకు సముద్రం 30 మీటర్ల ముందుకు చొచ్చుకు వచ్చింది.
ఈ తుఫాన్ ప్రభావంతో ప్రకాశం, బాపట్ల జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. రాష్ట్రంలోని 11 జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసింది.
మరో 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ఇవాళ రాత్రికి కూడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వర్షం కురిసే జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆఫీస్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.