ఏపీకి తుఫాన్‌ ముప్పు.. రేపటి నుంచి ప్రళయమే..

ఏపీ వైపుగా తుఫాన్ ముప్పు దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది పుదుచ్చేరికి 730 కిలోమీటర్లు, చెన్నైకి 740 కిలోమీటర్లు, నెల్లూరుకు 860 కిలోమీటర్లు, బాపట్లకు 930 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 910 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి.. శనివారానికి నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా.. ఆదివారానికి తుఫాన్‌గా బలపడుతుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత వాయవ్య దిశగా పయనించి సోమవారం నాటికి నెల్లూరు, మచిలీపట్నం మధ్యలో తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నా్. ఈ తుఫాన్‌కు మిచౌంగ్‌ అని పేరు పెట్టారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 2, 2023 | 01:58 PMLast Updated on: Dec 02, 2023 | 1:58 PM

Typhoon Threat To Ap Flood From Tomorrow

ఏపీ వైపుగా తుఫాన్ ముప్పు దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది పుదుచ్చేరికి 730 కిలోమీటర్లు, చెన్నైకి 740 కిలోమీటర్లు, నెల్లూరుకు 860 కిలోమీటర్లు, బాపట్లకు 930 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 910 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి.. శనివారానికి నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా.. ఆదివారానికి తుఫాన్‌గా బలపడుతుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత వాయవ్య దిశగా పయనించి సోమవారం నాటికి నెల్లూరు, మచిలీపట్నం మధ్యలో తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నా్. ఈ తుఫాన్‌కు మిచౌంగ్‌ అని పేరు పెట్టారు.

Congress CM : తెలంగాణ కాంగ్రెస్ లో కుర్చీలాట.. సీఎం ఎవరు..?

దీని ప్రభావంతో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయ్. పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉంది. మంగళవారం దక్షిణ కోస్తా, ఉత్తరకోస్తాలో అత్యంత భారీ వర్షాలు పడతాయని అధికారులు సూచిస్తున్నారు. ఈ నెల 4న కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా, అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి.

తుఫాన్‌ హెచ్చరికలతో వరి రైతుల్లో ఆందోళన మొదలైంది. వరి కోతలు, కుప్పల దశల్లో ఉంది. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల కోసిన వరిపంటను కుప్పలుగా వేసి భద్రపరిచే పనిలో పడ్డారు. రైతులు పొలాల్లో పంటను కుప్పలుగా వేశారు. మరికొందరు కోత కోసిన పంటను ఆరబెట్టారు. రైతులు వరికుప్పలపై టార్పాన్లు కప్పారు. కొన్నిచోట్ల నూర్పిడి చేసిన ధాన్యాన్ని బస్తాల్లో భద్రపరిచారు. ఈ సమయంలో వర్షం కురిస్తే.. పంటపై పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.