Bhavishyavani : మరికాసేపట్లో ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి భవిష్యవాణి..
ఆషాడామాసం కావడంతో తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండుగ వాతావరణం నెలకొంది. సికింద్రాబాద్ లో ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి నిన్న ఆదివారం అంగరంగా వైభవంగా హైదరబాద్ నుంచి ప్రతి ఇంటి నుంచి బోనాలు అందుకుంది. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు.

Ujjain Mahankali Amma's prophecy in a little while..
ఆషాడామాసం కావడంతో తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండుగ వాతావరణం నెలకొంది. సికింద్రాబాద్ లో ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి నిన్న ఆదివారం అంగరంగా వైభవంగా హైదరబాద్ నుంచి ప్రతి ఇంటి నుంచి బోనాలు అందుకుంది. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలిబోనం సమర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక నేడు అతి ముఖ్యమైన ఘటం మొదలవునుంది.
మరికాసేపట్లో.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో భవిష్యవాణి చెప్పనున్నారు.
దీంతో తెల్లవారుజామునుంచే తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మక వాతావరణం వెల్లివిరుసింది. తెల్లవారుజామున అమ్మవారికి మహా హారతి, కుంకుమ, పుష్ప అర్చనలు నిర్వహించారు. సాకలు సమర్పించి విశేష నివేదన చేశారు. నేడు రంగం పేరుతో అమ్మవారు స్వరూపంగా భావించే మహిళ పచ్చి కుండ పై నిలబడి చెప్పే భవిష్యవాణిలో ఈ ఏడాది వర్షాలు ఎలా కురుస్తాయో, ప్రకృతి వైపరిత్యాలు సంభవిస్తాయా.. ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటే ఏమి చెయ్యాలో ఇవన్నీ చెబుతారు. ఇందుకోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.