Tattoos : కూతురి ప్రేమను టాటూస్ రూపంలో ప్రపంచానికి చాటిన ఓ తండ్రి..
(యూకే) బ్రిటన్‌కు చెందిన మార్క్ ఓవెన్ ఎవాన్స్ అనే వ్యక్తి తన కూతురు పేరు ను ఒంటిపై 667 సార్లు పచ్చబొట్టుగా వేయించుకొని వినూత్నంగా తన ప్రేమను చాటుకున్నాడు. 49 ఏళ్ల వయసున్న మార్క్ ఓవెన్ ఎవాన్స్ ఒకే పేరును తన శరీరంపై ఎక్కువసార్లు టాటూస్ రూపంలో వేయించుకుని ఏకైక వ్యక్తిగా ప్రపంచ రికార్డు కొల్లగొట్టాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఓవెన్ ఎవాన్స్ తన గిన్నిస్ రికార్డును తనే మరల బ్రేక్ చేశాడు అంటే నమ్ముతారా.. అవును తన గిన్నిస్ బుక్ రికార్డును తనే బ్రేక్ చేసుకున్న వ్యక్తిగా కూడా నిలిచాడు ఓవెన్ ఎవాన్స్.

UK A man named Mark Owen Evans from Britain has humbly expressed his love by tattooing his daughters name 667 times on his back
టాటూ ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఎందుకంటే ఈ జనరేషన్ పిల్లలను, యువతీ, యువకులను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్న పేరు. టాటూస్ తెలుగులో పచ్చబొట్టు అని అంటారు. ఎవరైనా సరే అమ్మాయిలు గానీ.. అబ్బాయిలు గానీ ఈ టాటూ ఎక్కువగా తమ శరిర భాగాలపై ఎక్కడో ఒక చోట వేయించుకుంటారు. అది అమ్మ పేరు గానీ.. నాన్న పేరు గానీ.. అన్న పేరు గానీ.. ఇంకా దగ్గరగా చెప్పలంటే అబ్బాయిలు తమ ప్రియువలి పేరు.. అమ్మాయిలు తమ ప్రియుడి పేర్లు ఇలా చేతుల పైనో ఛాతి పైనో వేయించుకుంటారు. ఇది మనందరికి తెలుసు.. ఇక ఎవరికి ఏ వ్యక్తి ఇష్టం లేకపోతే హీరోనో.. లేదా బొమ్మలు, సింబల్ ఇలా రకరకాలైన టాటూ వేయించుకుంటారు. ఒక వ్యక్తి తన శరీరంపై ఒకే పేరు 667 సార్లు టాటూస్ వేయించుకుని గిన్నిస్ బుక్ రికార్డును కొల్లగొట్టాడు తెలుసా.. మీకు అతనెవరో ఇప్పుడు చూద్దాం..
కుమార్తెపై ప్రేమను వినూత్నంగా చాటుకున్న ఓ తండ్రి..
(యూకే) బ్రిటన్‌కు చెందిన మార్క్ ఓవెన్ ఎవాన్స్ అనే వ్యక్తి తన కూతురు పేరు ను ఒంటిపై 667 సార్లు పచ్చబొట్టుగా వేయించుకొని వినూత్నంగా తన ప్రేమను చాటుకున్నాడు. 49 ఏళ్ల వయసున్న మార్క్ ఓవెన్ ఎవాన్స్ ఒకే పేరును తన శరీరంపై ఎక్కువసార్లు టాటూస్ రూపంలో వేయించుకుని ఏకైక వ్యక్తిగా ప్రపంచ రికార్డు కొల్లగొట్టాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఓవెన్ ఎవాన్స్ తన గిన్నిస్ రికార్డును తనే మరల బ్రేక్ చేశాడు అంటే నమ్ముతారా.. అవును తన గిన్నిస్ బుక్ రికార్డును తనే బ్రేక్ చేసుకున్న వ్యక్తిగా కూడా నిలిచాడు ఓవెన్ ఎవాన్స్.
తన రికార్డును తానే బ్రేక్ చేసిన మార్క్..
గతంలో 2017 లో మార్క్ ఓవెన్ ఎవాన్స్ తన కూతురు లూసీ పేరును తన వీపుపై 267 సార్లు పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు. అప్పుడే అత్యధిక టాటూలు వేయించుకున్న రికార్డును సంపాదించాడు మార్క్ ఓవెన్ ఎవాన్స్. అనంతరం 2020 లో అమెరికాకు చెందిన 27 ఏళ్ల డైడ్రా విజిల్ అనే మహిళ.. తన శరీరంపై 300 టాటూలు వేయించుకుని.. మార్క్ ఓవెన్ ఎవాన్స్ రికార్డును బద్దలుకొట్టింది. ఎలాగైనా తన రికార్డును బద్దలు కొట్టాలని.. అతని వెనుకభాగంలో ఎక్కువ ఖాళీ లేకుండా, అతను తన తొడలపై కొత్త పచ్చబొట్టు వేయాలని నిర్ణయించుకున్నారు మార్క్ ఓవెన్ ఎవాన్స్. ఇక తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా తన కూతురుకి ఇదే తన బహుమతిగా ఇవ్వాలని సంకల్పించి.. తన శరీరం పై మరో 400 టాటూస్ వేయించుకుని మొత్తం ఒకే పేరుతో 667 టాటూస్ వేయించుకున్న మొట్టమొదటి వ్యక్తిగా తన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును మరళ సొంతం చేసుకున్నాడు.

UK A man named Mark Owen Evans from Britain has humbly expressed his love by tattooing his daughters name 667 times on his back
టాటూస్ కు పట్టిన సమయం..
మొత్తం 400 టాటూలు కోసం ఐదున్నర గంటలు పట్టింది.. ఒక్కో కాలు మీద 200 టాటూ వేయించుకున్నాడు మార్క్ ఓవెన్ ఎవాన్స్. మొత్తం 400 టాటూల కోసం ఐదున్నర పట్టింది. ఒక్కో కాలుపై 200 పూర్తవుతుంది, మిస్టర్ ఇవాన్ GWSతో చెప్పారు. “రికార్డును తిరిగి క్లెయిమ్ చేయడానికి, దానిని నా కుమార్తెకు అంకితం చేయడానికి నేను వేచి ఉండలేకపోయాను” అని అతను మార్క్ ఓవెన్ ఎవాన్స్ చెప్పుకొచ్చారు.
S.SURESH