Umpires villains : ఆసీస్ పాలిట.. అంపైర్లే విలన్లు..!

వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టుకి అస్సలు కలిసి రావడం లేదు. భారత్ పై కోహ్లీ క్యాచ్ మిస్ చేసి మ్యాచ్ చేజార్చుకున్న కమ్మిన్స్ సేన.. దక్షిణాఫ్రికా జట్టుపై కూడా ఆ ఫీల్డింగ్ వైఫల్యాలను కొనసాగిస్తూ వచ్చిన  అవకాశాలను చేజార్చుకుంది.. ఇక బ్యాటింగ్ లో అదరగొడదామనుకున్న ఆసీస్ కి నిన్న అంపైర్లు విలన్ గా మారారు. ఇద్దరు స్టార్ బ్యాటర్ల విషయంలో అంపైర్లు తప్పుడు నిర్ణయాలు ఇవ్వడంతో ఆసీస్ కి తీరని అన్యాయం జరిగింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 13, 2023 | 02:53 PMLast Updated on: Oct 13, 2023 | 2:53 PM

Umpires Who Give Out Even If Not Out Aussie Palita Umpires Are Villains

వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టుకి అస్సలు కలిసి రావడం లేదు. భారత్ పై కోహ్లీ క్యాచ్ మిస్ చేసి మ్యాచ్ చేజార్చుకున్న కమ్మిన్స్ సేన.. దక్షిణాఫ్రికా జట్టుపై కూడా ఆ ఫీల్డింగ్ వైఫల్యాలను కొనసాగిస్తూ వచ్చిన  అవకాశాలను చేజార్చుకుంది.. ఇక బ్యాటింగ్ లో అదరగొడదామనుకున్న ఆసీస్ కి నిన్న అంపైర్లు విలన్ గా మారారు. ఇద్దరు స్టార్ బ్యాటర్ల విషయంలో అంపైర్లు తప్పుడు నిర్ణయాలు ఇవ్వడంతో ఆసీస్ కి తీరని అన్యాయం జరిగింది. లక్నో వేదికగా నిన్న దక్షిణాఫ్రికా పియా జరిగిన మ్యాచులో 312 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా 177 పరుగులకే ఆలౌటైంది. అయితే ఈ మ్యాచులో ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, మార్కస్ స్టయినీస్ నాటౌట్ అయినా అంపైర్లు అవుట్ గా ఇచ్చారు.

రబడా బౌలింగ్ లో స్మిత్ వికెట్ల ముందు దొరికిపోగా అంపైర్ నాటౌట్ గా ఇచ్చాడు. చూస్తుంటే ఈ బంతి లెగ్ స్టంప్ చాలా దూరంగా వెళ్తుంది. బౌలర్ కూడా అంత కాన్ఫిడెంట్ లేడు. కానీ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బావుమా మాత్రం రివ్యూకి వెళ్ళాడు. రెప్లైలో బంతి గమనం మాత్రం వికెట్లను తాకినట్లు చూపించడం ఆశ్చర్యంగా అనిపించింది. స్మిత్ తో పాటు చాలా మంది షాక్ కి గురయ్యారు. ఇక మార్కస్ స్టయినీస్ విషయంలోను ఇలాగే జరిగింది. లెగ్ స్టంప్ కి దూరంగా రబాడ వేసిన బంతిని ఆడబోయే క్రమంలో స్టోయినిస్ ప్యాడ్లకు తాకుతూ వెళ్లి కీపర్ చేతుల్లో పడింది. అయితే అవుట్ అనే సందేహంతో రివ్యూ తీసుకోగా బంతి బ్యాట్ కి తగలనట్లు స్పష్టంగా కనిపించినా థర్డ్ అంపైర్ ఔట్ గా ప్రకటించాడు. ఇలా రెండు ప్రధాన వికెట్లను థర్డ్ అంపైర్ తప్పిదాలతో కోల్పోవడం ఆసీస్ ని దెబ్బ తీసింది. ఈ విషయంలో అన్యాయం జరిగిందని ఆసీస్ ఫ్యాన్స్ అంపైరింగ్ తీరుపై మండి పడుతున్నారు.