LB Nagar: ఎల్బీ నగర్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. పోలీసులు ఏం చెప్పారంటే..
ఎల్బీనగర్ ఘటనలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి.

Unbelievable facts have come to light in the LB Nagar Shiva and Sanghavi murder case
ఎల్బీ నగర్ సంఘవి మర్డర్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నిందితుడు శివకు ఇప్పటికే క్రిమినల్ బ్యాంగ్రౌండ్ ఉన్నట్టు అతని గ్రామస్థులు చెప్తున్నారు. చాలా కాలం నుంచి శివ సైకోలా ప్రవర్తిస్తున్నాడంటూ చెప్తున్నారు. వాళ్లు చెప్పే వాస్తలు విని పోలీసులే నిర్ఘాంత పోతున్నారు. బీటెక్ చదువుతున్న సమయంలో శివ చదువును పక్కన పెట్టి సినిమాల్లో అవకాశాలు వెతుక్కునేందుకు హైదరాబాద్‌కు వచ్చాడు. ఈ విషయంలో తండ్రితో కొన్ని సార్లు శివకు గొడవ కూడా జరిగింది. ఓ సారి జరిగిన గొడవలో తీవ్ర ఆగ్రహానికి గురైన శివ తన తండ్రిని పక్కనే ఉన్న సుత్తెతో తలపై కొట్టాడట. దీంతో శివ తండ్రి అక్కడిక్కడే చనిపోయాడట. అయితే ఇంటికి ఒక్కడే కొడుకు కావడంతో అతను జైలుకు వెళ్తే శివ తల్లి ఒంటరిది అవుతుందన్న కారణంగా ఈ విషయం బయటికి రాకుండా గ్రామ పెద్ద కప్పిపుచ్చారని శివగ్రామస్థులు చెప్తున్నారు.
తండ్రి చనిపోయిన తరువాత శివ హైదరాబాద్‌లోని రామాంతపూర్‌కు షిఫ్ట్ అయ్యాడు. అప్పటి నుంచి శివ మానసిక పరిస్థితి కూడా సరిగ్గా ఉండేది కాదని చెప్తున్నారు అతని గ్రామస్థులు. చిన్న చిన్న విషయాలకే ఆవేశంలో రిగిలిపోయి కంట్రోల్ లేకుండా ప్రవర్తిస్తుంటాడని చెప్తున్నారు. ఇప్పుడు సంఘవిపై హత్యాయత్నం కూడా అలాంటి పరిస్థితిలోనే చేసి ఉంటాడని చెప్తున్నారు. శివ సంఘవి కొంత కాలం ప్రేమలో ఉన్నారు. పెళ్లికి సంఘవి నిరాకరించడంతో శివ ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. సంఘవి, ఆమె తమ్ముడు ఒంటరిగా ఉన్న టైంలో వాళ్ల ఇంటికి వెళ్లి కత్తితో ఇద్దరిపై దాడి చేశాడు. కానీ స్థానికులు శివను పట్టుకుని గదిలో బంధించారు. సంఘవి తమ్ముడు చికిత్స పొందుతూ చనిపోగా సంఘవి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం శివ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ సైకో శివ వ్యవహారం ఇప్పుడు హైదరాబాద్‌లో సంచలనంగా మారింది.