Finance Minister Nirmala Sitharaman : 75 ఏళ్ల భారత దేశ చరిత్రలో నిర్మాల సీతారమన్ అరుదైన రికార్డ్..
75 ఏళ్ల భారత దేశ చరిత్రలో నిర్మాల సీతారమన్ అరుదైన రికార్డ్ బ్రేక్ చేసింది. భారత దేశ చరిత్రలోనే తొలి మహిళ ఆర్థిక శాఖ మంత్రిగా పదవిని స్వీకరించి రికార్డ్ సృష్టించారు. నిర్మలా సీతారామన్ 1959 ఆగస్టు 18న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించింది. 1980లో సీతాలక్ష్మీ రామస్వామి కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

Union Finance Minister Nirmala Sitharaman has created a rare record in the 75-year history of independent India
75 ఏళ్ల భారత దేశ చరిత్రలో నిర్మాల సీతారమన్ అరుదైన రికార్డ్ బ్రేక్ చేసింది. భారత దేశ చరిత్రలోనే తొలి మహిళ ఆర్థిక శాఖ మంత్రిగా పదవిని స్వీకరించి రికార్డ్ సృష్టించారు. నిర్మలా సీతారామన్ 1959 ఆగస్టు 18న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించింది. 1980లో సీతాలక్ష్మీ రామస్వామి కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ (ఇంటర్నేషనల్ స్టడీస్) పట్టా పొందింది. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీలోనూ పనిచేసింది. 2003-05 మధ్యకాలంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా పనిచేసింది. ఆమె అత్తమామలు కాంగ్రెస్‌కు చెందినవారైనప్పటికీ బీజేపీ వైపు ఆకర్షితురాలు అయ్యి.. నిర్మలా సీతారామన్ 2008లో బీజేపీలో చేరారు. 2014 రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని ఆరుగురు బీజేపీ అధికార ప్రతినిధుల బృందంలో ఒకరిగా ఉన్నారు. అదే ఏడాది నరేంద్ర మోదీ మంత్రివర్గంలో సహాయక మంత్రిగా చేరి.. ఆ తర్వాత జూన్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. 3 సెప్టెంబర్ 2017న, ఆమె రక్షణ మంత్రిగా నియమితులయ్యారు. ప్రధాన మంత్రి హోదాలో ఇందిరా గాంధీ తర్వాత కేంద్ర రక్షణ శాఖ మంత్రి పదవిని నిర్వహించిన రెండవ మహిళ.. గుర్తింపు పొందారు. ఆ తర్వాత పూర్తి స్థాయి తొలి మహిళ రక్షణ శాఖ మంత్రిగా రికార్డ్ క్రియేట్ చేశారు. 2019లో మే 31న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో NDA కూటమి వరుసగా రెండో సారి అధికారం చేపట్టగా.. భారత మొట్టమొదటి పూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ కూడా భారతదేశపు మొదటి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రిగా భాద్యతలు స్వీకరించి మరో రికార్డ్ క్రియేట్ చేశారు.
సీతారామన్ 2020–21 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను 1 ఫిబ్రవరి 2020న పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. ఆ తర్వాత ఆమె ఆర్ధిక శాఖ మంత్రుత్వ ఆధ్వర్యంలోనే భారత దేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అనంతరం భారతదేశంలోని కొత్త పార్లమెంటు భవనంలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన తొలి ఆర్థిక శాఖ మంత్రిగా గుర్తింపు దక్కింది. 2020లో పార్లమెంట్ లో ఆర్థిక బడ్జెట్ ప్రవేశ పెడుతు దాదాపు రెండు గంటల నలభై నిమిషాలు ఆమె ప్రసంగించారు. 2021లో డిజిటల్ బడ్జెట్ తెచ్చి కొత్త విధానానికి ఆమె నాంది పలికారు. ఆ తర్వాత 2022లో కర్ణాటక రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికైంది. సీతారామన్ ఫోర్బ్స్ 2022లో ప్రపంచంలోని 100 మంది శక్తివంతమైన మహిళల జాబితాలో స్థానం సంపాదించారు. 2023లో ప్రపంచంలోని 100 మంది శక్తివంతమైన మహిళల జాబితాలో ఆమె 32వ స్థానంలో నిలిచింది యావత్ ప్రపంచ సైతం తనవైపు చూసేలా చేసింది. ఆ తర్వాత ఇందిరా గాంధీ తర్వాత భారతదేశంలో అత్యంత శక్తివంతమైన మహిళగా గుర్తింపు పొందింది.
2019లో మే 31న NDA కూటమి ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేప్పట్టి.. అప్పటినుంచి నేటి వరకు వరుసగా ఏడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ నేడు రికార్డ్ నెలకొల్పింది. దీంతో మొరార్జీ దేశాయ్ (6) రికార్డ్ బ్రేక్ అయ్యింది.. అయితే అత్యధికసార్లు బడ్జెట్ తెచ్చిన ఘనత దేశాయ్ (10) పేరునే ఉంది. నిర్మల ఖాతాలో సుదీర్ఘ ప్రసంగం చేసిన రికార్డ్ కూడా ఉంది.