Amit Shah road show : నేడు పాత బస్తీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రోడ్ షో..
నేడు పాత బస్తీలో..లాల్‌దర్వాజ నెహ్రూ విగ్రహం నుంచి సుధా టాకీస్ వరకు రాత్రి 8.15 గంటల నుంచి 9.15 గంటల వరకు గంటపాటు ఈ రోడ్ షో

Union Home Minister Amit Shah road show in old basti today..
నేడు తెలంగాణలో కేంద్ర హోం మంత్రి (Home Minister) అమిత్ షా (Amit Shah) పర్యటించనున్నారు. లోక్ సభ ఎన్నికల వేళ దేశ వ్యాప్తంగాం అమిత్ షా సుడిగాలి పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే.. కాగా నేడు హైదరాబాద్ లో బీజేపీ (BJP) అభ్యర్థి మాధవీలత (Madhavila) మద్దతుగా నగరంలో రోడ్ షో (Road Show) నిర్వహించనున్నారు.
అమిత్ షా నేడు.. రాత్రి 7:30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో లాల్ దర్వాజ చేరుకోనున్నారు. లాల్‌దర్వాజ నెహ్రూ విగ్రహం నుంచి సుధా టాకీస్ వరకు రాత్రి 8.15 గంటల నుంచి 9.15 గంటల వరకు గంటపాటు ఈ రోడ్‌షో ద్వార ప్రచారం చేయ్యనున్నారు. రోడ్ షో అనంతరం అమిత్ షా నేరుగా నాంపల్లిలోని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. రాత్రి 9:30 గంటల నుంచి 10:45 గంటల వరకు చేవెళ్ల, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.
రంగారెండ్డి లోని చేవెళ్ల, నాగర్ కర్నూల్, మహాబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో తాజా పరిస్థితుల గురించి అమిత్ షా ఆరా తీయనున్నారు. కాగా ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ లో మోడీ పథకాలు ప్రతి ఇంటింటికి వెళ్లి చేప్పాలని పార్లమెంట్ అభ్యర్థులకు దిశానిర్థేం చేశారు. ఇక ఈ సమావేశం అనంతరం అమిత్ షా బేగంపేట లోని ఐటీసీ కాకతీయలో చేరుకోని రాత్రికి అక్కడే బస చేయ్యానున్నారు.
SSM