Ayodhya : అయోధ్యలో అపూర్వ ఘట్టం.. సూర్య వంశస్తుడైన రఘురాముడి నుదిటిని తాకిన సూర్యకిరణాలు
అయోధ్యలో అపూర్వ ఘట్టం.. సూర్య వంశస్తుడైన రఘురాముడి నుదిటిని తాకిన సూర్యకిరణాలు

సూర్య వంశస్తుడైన రఘురాముడి నుదిటిని తాకిన సూర్యకిరణాలు

ఏప్రిల్ 17 బుధవారం శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య రామాలయంలో అద్భుతం అవిషుతం అయ్యింది.

శ్రీరామనవమి రోజున అయోధ్యలో రామ్ లల్లా విగ్రహం నుదుటిపై సూర్య కిరణాలు ముద్దాడాయి.

2024 ఏప్రీల్ 17న తేదీ మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 16 నిమిషాల 12 గంటల 21 నిమిషాల మద్య అయోధ్య బాలరాముడి నుదుటిని సూర్యకిరణం / సూర్య తిలకం తాకాయి.

ప్రతీ శ్రీరామ నవమి రోజు రామ్ లల్లాకు సూర్యాభిషేకం

సూర్యకిరణాలు రాముడిపై పడటంతో అయోధ్య నగరం రామ నినాదాలతో మార్మోగిపోయింది.

'సూర్య తిలక్' వెనుక ఉన్న సైన్స్..

రామ్ లల్లా సూర్యాభిషేకం అత్యంత నాణ్యమైన అద్దాలు, లెన్సులతో కూడిన ఆప్టోమెకానికల్ వ్యవస్థను ఉపయోగించి నిర్వహించనున్నారు.

సూర్య తిలకం సందర్భంగా రామాలయంలోకి భక్తులను అనుమతిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు.

సూర్య కిరణాలు మొదట ఆలయం పై అంతస్తులో ఏర్పాటు చేసిన అద్దంపై పడతాయని సీఎస్ఐఆర్-సీబీఆర్ఐ శాస్త్రవేత్త వివరించారు.

వ్యూహాత్మకంగా అమర్చిన మూడు లెన్సులను ఉపయోగించి ఈ కిరణాలను ఆలయంలోని రెండో అంతస్తులోని మరో అద్దం వైపు మళ్లిస్తారు.

ఆ తరువాత, అక్కడి నుంచి మరో అద్దం ఉపయోగించి సూర్య కిరణాలను గర్భ గుడి లోని రామ్ లల్లా విగ్రహం నుదుటిపై పడేలా చేస్తారు.

ఇలాంటి అపూర్వ ఘట్టం మళ్లీ చూడాలంటే.. మళ్లీ వచ్చే శ్రీరామనవమి వరకు ఆగాలి.