Weather Update : నైరుతి’ వచ్చే వరకు.. వర్షాల్లేవు.. మళ్లీ ఎండలే!
నైరుతి రుతుపవనాలు వచ్చే వరకు రాష్ట్రంలో వేడి, ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి జూన్ 3 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

Until the 'southwest' comes.. no rains.. sunny again!
నైరుతి రుతుపవనాలు వచ్చే వరకు రాష్ట్రంలో వేడి, ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి జూన్ 3 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడితే వర్షాలు కురిసి వాతావరణం చల్లబడుతుందని ప్రజలు భావించారు. కానీ రెమాల్ తుఫాను బంగ్లాదేశ్ వైపు వెళ్లిపోవడంతో టెంపరేచర్ పెరిగింది. అటు TGలోనూ మరో రెండు రోజునలు తప్ప.. జూన్ 1 వరకు పొడివాతావరణం కొనసాగనుంది.
నేడు ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు
ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో కొద్దిరోజులుగా వాతావరణం చల్లబడింది. దీంతో రాష్ట్రంలోని తీరప్రాంత వాసులకు ఉక్కపోత నుంచి కొంత వరకు ఉపశమనం లభించింది. కాగా తుపాను ప్రభావంతో పొడి వాతావరణం నెలకొని.. పలు జిల్లాలలో వేడి, ఉక్కపోత పెరిగాయి. నేటి నుంచి రాష్ట్రంలో ఎండ ప్రభావం చూపనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇవాళ 72 మండలాల్లో తీవ్ర వడగాలులు, 200 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రేపు 165 మండలాల్లో తీవ్ర వడగాలులు,149 మండలాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. నిన్న అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో 40.9°C ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. నైరుతి రుతుపవనాలు వచ్చేవరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, వడగాలులు తీవ్రరూపం దాల్చుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.