The Apollo Story : డాక్టర్ ప్రతాప్ సి రెడ్డిపై ఉపాసన పుస్తకం..
భారతదేశంలో ప్రైవేట్ రంగంలో ఆరోగ్య సంరక్షణకు మార్గదర్శకత్వం వహించిన వ్యక్తిగా అపోలో వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డికి పేరుంది.. ఆధునిక భారతీయ ఆరోగ్య సంరక్షణ (Indian Healthcare) రూపశిల్పిగా ఈ అవార్డు నిలపడంతో పాటు ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను ప్రతి భారతీయుడికి అందుబాటులోకి తీసుకురావడంలో ఆయన చేసిన అసమానమైన కృషి మరువలేనిది..

Upasana book on Dr. Pratap C Reddy..
భారతదేశంలో ప్రైవేట్ రంగంలో ఆరోగ్య సంరక్షణకు మార్గదర్శకత్వం వహించిన వ్యక్తిగా అపోలో వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డికి పేరుంది.. ఆధునిక భారతీయ ఆరోగ్య సంరక్షణ (Indian Healthcare) రూపశిల్పిగా ఈ అవార్డు నిలపడంతో పాటు ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను ప్రతి భారతీయుడికి అందుబాటులోకి తీసుకురావడంలో ఆయన చేసిన అసమానమైన కృషి మరువలేనిది.. డాక్టర్ రెడ్డి (Dr. Pratap) ప్రయత్నాల ఫలితంగా, భారతదేశం నేడు క్లినికల్ ఫలితాలను అభివృద్ది చెందిన దేశాలతో సరిసమానంగా, కొన్ని సమయాల్లో ప్రపంచ ప్రమాణాల కంటే మెరుగ్గా అత్యంత అధునాతన ఆరోగ్య సంరక్షణను అందించేవాటిలో ఒకటిగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.. అంతటి మహోన్నత వ్యక్తికి సంబంధించిన అపోలో గ్రూప్ సంస్థల చరిత్రను పూర్తిగా తెలుసుకోవాలనుకునే వారికి ఇప్పుడు ఒక గోల్డెన్ ఛాన్స్ అందుబాటులో ఉంది.. డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి మనమరాలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని కొణిదెల రచించిన మోస్ట్ అవైటెడ్ ‘ది అపోలో స్టోరీ’ (The Apollo Story) పుస్తకం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది..
చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి 91వ పుట్టినరోజును పురస్కరించుకుని ‘ది అపోలో స్టోరీ’పుస్తకాన్ని ఆవిష్కరించారు.. అమర్ చిత్ర కథ సౌజన్యంతో ఈ పుస్తకం అందుబాటులో ఉంటుంది. డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి ఆరోగ్య సంరక్షణకు చేసిన అసమానమైన కృషికి ఉపాసన ఈ పుసక్తాన్ని అంకిత మిచ్చారు.. అపోలో కథ కేవలం ఒక పుస్తకం కాదు.. ఇది అపోలో హాస్పిటల్స్ సాధించిన మైలురాళ్ల తాలూకా భావోద్వేగ ప్రయాణం.. రాబోయే వారసత్వంలో నమ్మకం, విశ్వాసం, ఆశకు చిహ్నంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు..
వ్యక్తులు, ముఖ్యంగా మహిళలు.. వారి అపరిమితమైన సామర్థ్యాన్ని పెంపొందించుకునేలా అపోలో స్టోరీ పుస్తకాన్ని ఉపాసన రచించారు.. ఈ పుస్తకం అక్కడ ఉన్న చిన్నారులందరికీ – పెద్దగా కలలు కనాలో నేర్పింస్తుందని ఉపాసన తెలిపారు.. తమ చిన్నతంలో తమ తాత కథలను చదవడానికి ప్రోత్సహించేవారని తెలిపారు.. ది అపోలో స్టోరీ’ అపోలో మిషన్‌ను నిర్వచించిన సవాళ్లు, ఆవిష్కరణలు, విజయాలతో పాటు.. డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి చరిత్రను తెలియజేస్తుందన్నారు.. తల్లిదండ్రులంతా తండ్రులంతా తమ కుమార్తెల కోసం పెద్ద కలలు కనేలా స్ఫూర్తిని పొందేందుకు ఈ పుస్తకాన్ని చదవాలని అన్నారు.