Usha Chilukuri Vance : అమెరికా వైస్ ప్రెసిడెంట్ రేసులో వాన్స్…. తెలుగింటి అల్లుడే !

అమెరికాలో ట్రంప్ పార్టీ గెలిస్తే... అమెరికన్ రెండో మహిళగా ఉషా చిలుకూరి వార్తల్లోకి ఎక్కబోతున్నారు. ఎందుకంటే రిపబ్లిక్ పార్టీ నుంచి వైస్ ప్రెసిడెంట్ రేసులో ఉన్న జే.డీ. వాన్స్ తెలుగింటి అల్లుడే. ఆయన భార్య ఉష చిలుకూరి ... అమెరికాలో స్థిరపడిన ఆంధ్ర ఫ్యామిలీకి చెందినవారు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 16, 2024 | 02:04 PMLast Updated on: Jul 16, 2024 | 2:05 PM

Usha Chilukuri Vance

అమెరికాలో ట్రంప్ పార్టీ గెలిస్తే… అమెరికన్ రెండో మహిళగా ఉషా చిలుకూరి వార్తల్లోకి ఎక్కబోతున్నారు. ఎందుకంటే రిపబ్లిక్ పార్టీ నుంచి వైస్ ప్రెసిడెంట్ రేసులో ఉన్న జే.డీ. వాన్స్ తెలుగింటి అల్లుడే. ఆయన భార్య ఉష చిలుకూరి … అమెరికాలో స్థిరపడిన ఆంధ్ర ఫ్యామిలీకి చెందినవారు. రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా జేడీ వాన్స్ ను ప్రకటించారు ట్రంప్. కాల్పుల సంఘటన తర్వాత అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు డొనాల్డ్ ట్రంప్ కి అవకాశాలు పెరిగాయి. వచ్చే ఎన్నికల్లో రిపబ్లికన్లు గెలిస్తే… తెలుగింటి అల్లుడు వాన్స్ ఉపాధ్యక్షుడు అవుతారు.

కాలిఫోర్నియాలోని శాన్ డియోగాలో… ఉష చిలుకూరి కుటుంబం ఆంధ్ర నుంచి వెళ్ళి స్థిరపడింది. ఉష యేల్ యూనివర్సిటీలో లా డిగ్రీ చదివారు. యేల్ జర్నల్ ఆఫ్ లా అండ్ టెక్నాలజీ మేగజైన్ కి మేనేజింగ్ ఎడిటర్ గా కూడా పనిచేశారు. యేల్ లా స్కూల్లో చదివేటప్పుడే జే.డి వాన్స్ తో ఉషకు పరిచయం ఏర్పడింది. 2014లో కెంటకీలో వాళ్ళు పెళ్ళి చేసుకున్నారు. హిందూ సంప్రదాయంలోనే వీళ్ళ మ్యారేజ్ జరిగింది. వాన్స్-ఉషకు ముగ్గురు పిల్లలు.
వాన్స్ రచించిన హిల్ బిల్లి ఎలెజీ పుస్తకం అమెరికాలో అత్యధికంగా అమ్ముడుపోయింది… ఆ తర్వాత సినిమా కూడా తీశారు. వాన్స్… టెక్నాలజీ, ఫైనాన్స్ రంగాల్లో మంచి బిజినెస్ మెన్ కూడా. 2002లో ఆయన అమెరికా సెనేట్ కు ఎన్నికయ్యాడు. మొదట్లో ట్రంప్ పాలసీలను వ్యతిరేకించినా… తర్వాత ఆయనకు విధేయుడిగా మారారు. పుస్తక రచనతో పాటు… రాజకీయంగా అనేక అంశాల్లో భర్తకు ఉష అండగా నిలబడ్డారు. 2018 వరకూ డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధిగా ఉన్న ఉష చిలుకూరి… తర్వాత రిపబ్లికన్ పార్టీలోకి మారారు. వాన్స్ ఒహాయో సెనేటర్ గా పోటీ చేస్తున్నప్పుడు ప్రచారంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. 2015 నుంచి లాకు సంబంధించిన సంస్థలు ముంగర్, టోల్స్, ఓస్లాన్ లో కార్పొరేట్ లిటిగేటర్ గా పనిచేస్తున్నారు ఉష చిలుకూరి. వాన్స్ వైస్ ప్రెసిడెంట్ రేసులో ఉండటంతో… అమెరికాలో కమ్మ సామాజిక వర్గం గ్రూపుల్లో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.