నేషనల్ క్రికెట్ లీగ్ ఊతప్ప నాటుకొట్టుడు
అమెరికా వేదికగా జరుగుతున్న నేషనల్ క్రికెట్ లీగ్ ఆరంభ సీజన్ లో భారత మాజీ క్రికెటర్లు దుమ్మురేపుతున్నారు. మొన్న సురేష్ రైనా విధ్వంసం సృష్టిస్తే తాజాగా రాబిన్ ఊతప్ప మెరుపులు మెరిపించాడు.

అమెరికా వేదికగా జరుగుతున్న నేషనల్ క్రికెట్ లీగ్ ఆరంభ సీజన్ లో భారత మాజీ క్రికెటర్లు దుమ్మురేపుతున్నారు. మొన్న సురేష్ రైనా విధ్వంసం సృష్టిస్తే తాజాగా రాబిన్ ఊతప్ప మెరుపులు మెరిపించాడు. చికాగో జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఊతప్ప టెక్సాస్ టీమ్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 27 బంతుల్లోనే 7 సిక్సర్లు, 5 ఫోర్లతో 66 పరుగులు చేశాడు. ఊతప్ప చివరిసారిగా వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో ఆడాడు. కాగా ఇదే మ్యాచ్ లో మరో బ్యాటర్ క్రిస్ లిన్ కూడా విధ్వంసకర బ్యాటింగ్ తో దుమ్మురేపాడు. 23 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు. వీరిద్దరి జోరుతో చికాగో 10 ఓవర్లలో 173 రన్స్ చేయగా.. ఛేజింగ్ లో టెక్సాస్ 132 పరుగులే చేయగలిగింది.