Uttam on Kaleswaram : కాళేశ్వరంపై ఎంక్వైరీ చేయిస్తాం…. జనం డబ్బులు వేస్ట్ చేస్తే ఊరుకోం: ఉత్తమ్
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణకు ఆదేశిస్తామనీ... ప్రజల డబ్బులతో మనం ప్రాజెక్టులను కడుతున్నాం..పూర్తిగా బాధ్యత యుతంగా, జవాబుదారీతనంతో పని చేయాలని అన్నారు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలోని సాగు నీటి ప్రాజెక్టు పురోగతిపై జలసౌధాలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇందులో ENC మురళీధర్ తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Uttam on Kaleswaram కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణకు ఆదేశిస్తామనీ… ప్రజల డబ్బులతో మనం ప్రాజెక్టులను కడుతున్నాం..పూర్తిగా బాధ్యత యుతంగా, జవాబుదారీతనంతో పని చేయాలని అన్నారు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలోని సాగు నీటి ప్రాజెక్టు పురోగతిపై జలసౌధాలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇందులో ENC మురళీధర్ తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని ప్రాజెక్టుల వారీగా సమీక్ష చేశారు మంత్రి ఉత్తమ్. ప్రాజెక్టులకు అవుతున్న విద్యుత్ వినియోగం గురించి తెలుసుకున్నారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు తదితర ప్రాజెక్టులపై లోతుగా సమీక్ష చేయాలని నిర్ణయించారు. నీటి పారుదల శాఖలో పనులు అత్యంత పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు మంత్రి. పనుల్లో థర్డ్ పార్టీ చెక్ ఉండాలని సూచించారు. జనంలో నీటిపారుదల రంగంపై ఉన్న అపోహలు తొలగిపోయేలా పని చేయాలని అధికారులను కోరారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీటి వాటా విషయమై కేంద్రంతో చర్చిస్తామనీ… పెండింగ్ ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 40 వేల చెరువుల నిర్వహణ గురించి తమ ప్రభుత్వం శ్రద్ద వస్తుందన్నారు మంత్రి.
కాళేశ్వరంపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేస్తామన్నారు. ప్రజల డబ్బుతో జరిగే పనుల్లో సీక్రెసీ అవసరం లేదన్నారు. కొత్త ఆయకట్టు వివరాలు ఇవ్వమని అధికారులను ఆదేశించినట్టు ఉత్తమ్ చెప్పారు. కోట్ల మంది ప్రజల విశ్వాసంతో ముడిపడి ఉన్న అంశం…అంతా పారదర్శకంగా ఉంటుందన్నారు. తుమ్మడిహట్టి ప్రాజెక్ట్ నిర్మాణం గురించి ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. SLBC ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసేందుకు ఎంతైనా ఖర్చు చేసేందుకు కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.