Uttarpradesh: గ్యాంగ్‌స్టర్‌లకు మాన్‌స్టర్‌.. యోగి వేట షురూ..

స్టేట్‌లో లా అండ్‌ ఆర్డర్‌ కంట్రోల్‌ తప్పుతున్నాయంటే అక్కడ గ్యాంగ్‌స్టర్స్‌ ఎక్కువగా ఉన్నారని అర్థం. కానీ అదే గ్యాంగ్‌స్టర్స్‌ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారంటే అక్కడ యోగి ఆధిత్యనాథ్‌ లాంటి సీఎం ఉన్నాడని అర్థం. చిన్నా పెద్దా తేడా లేకుడా ప్రతీ గ్యాంగ్‌స్టర్‌ షేప్‌ మార్చేస్తున్నారు యోగి. ఒకప్పుడు యూపీని షేక్‌ చేసిన అతీక్‌ అహ్మద్‌ అనే గ్యాంగ్‌స్టర్‌ ఇప్పుడు యోగి దెబ్బకు ప్రాణాలు కాపాడమని ప్రాధేయపడుతున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 13, 2023 | 05:30 PMLast Updated on: Apr 13, 2023 | 5:30 PM

Uttarpradesh Gangstar Attack

నా పని అయిపోయింది.. కనీసం నా కుటుంబాన్ని అయినా కాపాడండి అంటూ మీడియా ముందు మొర పెట్టుకుంటున్నాడు. కానీ అతీక్‌ విచారణ కోర్టులో జరుగుతుండగానే అతని కొడుకు అసద్‌, అనుచరుడు అల్హంను కుక్కును కాల్చినట్టు కాల్చి చంపారు యూపీ స్పెషల్‌ టాస్క్‌ పోలీసులు. ఉమేశ్‌ కేసులో ఇన్వాల్వ్‌ అయిన ఏ గ్యాంగ్‌స్టర్‌ను వదిలేది లేదంటూ రీసెంట్‌గానే అసెంబ్లీలో స్టేట్‌మెంట్‌ ఇచ్చారు యోగి. చెప్పినట్టుగానే ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్‌ను ఎన్‌కౌంటర్‌ చేయించారు. ఈ కేసుతో సంబంధమున్న మరో ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్‌ గతంలో ఎన్కౌంటర్‌కు గురయ్యారు. 2004 ఎన్నికల్లో అలహాబాద్‌ వెస్ట్‌ కాన్సిట్యుఎన్సీ నుంచి అతీక్‌ సోదరుడిపై పోటీ చేసి రాజుపాల్‌ అనే బీఎస్పీ క్యాండిడేట్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇది జరిగిన సంవత్సరానికే రాజుపాల్‌ దారుణ హత్యకు గురయ్యారు. ఈ మర్డర్‌ కేసులో అతీక్‌ ప్రధాన నిందితుడు. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేష్‌ పాల్‌ అనే వ్యక్తిని కూడా ఫిబ్రవరిలో అతీక్‌ గ్యాంగ్‌ చంపేశారు. కారులో వెంబడించి, టియర్‌గ్యాస్‌ వేసి పట్టపగలే నడిరోడ్డుపై కాల్చి చంపారు. ఈ కేసులో అతీక్‌ అహ్మద్‌, అతని కొడుకు అసద్‌ సహా 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతీక్‌ను అరెస్ట్‌ చేశారు కానీ అసద్‌, గుల్హం మాత్రం తప్పించుకున్నారు. అప్పటి నుంచీ వాళ్లకోసం యూపీ స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ వెతుకుతున్నారు. వాళ్లపై 5 లక్షలు రివార్డ్‌ కూడా ప్రకటించారు. ఉమేష్‌ పాల్‌ మర్డర్‌ కేసులో ఇవాళ ప్రయాగ్‌రాజ్‌ కోర్టులో విచారణ ఉంది. అదే టైంలో అసద్‌, గుల్హం ఝాన్సీలో ఉన్నట్టు SPF పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఓ టీం అక్కడికి వెళ్లారు. విషయం తెలిసిన అతీక్‌ కోర్టుకు వస్తుండగా పోలీస్‌ వ్యాన్‌ నుంచే మీడియాతో ప్రాధేయపడ్డాడు. తన పని అయిపోయిందని.. కనీసం తన కుటుంబ సభ్యులను అయినా కాపాడండీ అంటూ వేడుకున్నాడు. కోర్టులో జడ్జితో కూడా అదే విన్నవించుకున్నాడు. ఓ పక్క కోర్టులో విచారణ జరుగుతుండగానే SPF టీం.. ఝాన్సీలో అసద్‌, గుల్హం ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఇద్దరు నిందితులు పోలీసులపై ఎదురుకాల్పులు జరపడంతో ఇద్దరినీ ఎన్కౌంటర్‌ చేశారు. అసద్‌, గుల్హం ఎన్కౌంటర్‌పై ఉమేశ్‌పాల్‌ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. యూపీ సీఎంపై తమకు నమ్మకం ఉందన్నారు. జైల్‌లో ఉన్న అతీక్‌ను కూడా ఎన్కౌంటర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.