Vada Pav: వడ పావ్‌కు ప్రపంచ గుర్తింపు.. బెస్ట్ శాండ్‌విచ్‌ జాబితాలో చోటు..!

వడ పావ్‌‌కు ముంబై ఫేమస్. ఇక్కడే అసలు సిసలైన అథెంటిక్ వడ పావ్ దొరుకుతుంది. ముంబై వెళ్లిన వాళ్లెవరైనా మొదట టేస్ట్ చేయాల్సింది వడ పావ్‌నే. ఇది స్ట్రీట్‌ ఫుడ్‌గా ఫేమస్. రోడ్డు సైడ్ చిన్న బండ్ల మీద నుంచి పెద్ద హోటళ్ల వరకు వడ పావ్ దొరుకుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 13, 2024 | 05:46 PMLast Updated on: Mar 13, 2024 | 5:46 PM

Vada Pav Named Among Best Sandwiches In The World

Vada Pav: ఇండియాలో.. అందులోనూ ఉత్తరాదిన అత్యంత ఫేమస్ ఫుడ్ ఐటమ్ వడ పావ్. శాండ్‌విచ్ జాబితాలో ఉన్న వడ పావ్‌కు ఇప్పుడు ప్రపంచ గుర్తింపు లభించింది. ప్రపంచంలోని అత్యుత్తమ శాండ్‌విచ్‌ల జాబితాలో చోటు దక్కింది. ఈ జాబితాలో వడ పావ్‌ 19వ స్థానం దక్కించుకుంది. ప్రపంచంలోని టాప్-50 బెస్ట్ శాండ్‌విచ్‌ల జాబితాను టేస్ట్ అట్లాస్ అనే సోషల్ మీడియాలో వెల్లడించారు. దీనిలో మన వడ పావ్‌ టాప్-20లో నిలవడం విశేషం.

Ganta Narahari: తిరుపతి బరిలో నరహరి! తిరుపతి బరిలో గంటా నరహరి కన్ఫార్మ్‌!

వడ పావ్‌‌కు ముంబై ఫేమస్. ఇక్కడే అసలు సిసలైన అథెంటిక్ వడ పావ్ దొరుకుతుంది. ముంబై వెళ్లిన వాళ్లెవరైనా మొదట టేస్ట్ చేయాల్సింది వడ పావ్‌నే. ఇది స్ట్రీట్‌ ఫుడ్‌గా ఫేమస్. రోడ్డు సైడ్ చిన్న బండ్ల మీద నుంచి పెద్ద హోటళ్ల వరకు వడ పావ్ దొరుకుతుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో వడ పావ్ కనిపిస్తుంది. కొందరికి ఇది ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ కూడా. మెత్తటి బన్‌తో.. మధ్యలో బంగాళాదుంపతో చేసే వంటకమిది. దీన్ని ముంబై దాదార్ రైల్వే స్టేషన్‌లో స్ట్రీట్ ఫుడ్ నిర్వహించే అశోక్ వైద్య అనే వ్యక్తి తయారు చేశాడు. అక్కడ ఆకలితో ఉన్న పేదవారికి తక్కువ ఖర్చుతో, ఎక్కువ శక్తినిచ్చే వంటకం తయారు చేయాలనుకున్నాడు. అలా వడ పావ్‌ తయారు చేసి విక్రయించేవాడు. టేస్టీగా ఉండటం.. శక్తినివ్వడం వల్ల దీనికి తక్కువ కాలంలోనే ఎక్కువ గుర్తింపు దక్కింది.

తర్వాత ముంబై మొత్తం వడ పావ్ సెంటర్లు పుట్టుకొచ్చాయి. తర్వాత దేశం మొత్తంతోపాటు, ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఉన్న చోటకు కూడా విస్తరించింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహార ప్రియులను కూడా ఆకర్షిస్తూ.. ప్రపంచంలోనే ఉత్తమ శాండ్‌విచ్‌ల జాబితాలో చోటు దక్కించుకుంది. దీన్ని బాంబే బర్గర్ అని కూడా అంటారు.

 

View this post on Instagram

 

A post shared by TasteAtlas (@tasteatlas)