13 ఏళ్ళకే కోటీశ్వరుడు, చరిత్ర సృష్టించిన వైభవ్
ఐపీఎల్ ప్రపంచ క్రికెట్ ముఖచిత్రాన్నే మార్చేసిన లీగ్... అంతేకాదు మన దేశంలో యువ ఆటగాళ్ళ లైఫ్ నే మార్చేస్తున్న లీగ్... నిన్నటి వరకూ ఎవ్వరికీ తెలియని యంగస్టర్స్ అందరూ ఐపీఎల్ వేలంతో రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతున్నారు.
ఐపీఎల్ ప్రపంచ క్రికెట్ ముఖచిత్రాన్నే మార్చేసిన లీగ్… అంతేకాదు మన దేశంలో యువ ఆటగాళ్ళ లైఫ్ నే మార్చేస్తున్న లీగ్… నిన్నటి వరకూ ఎవ్వరికీ తెలియని యంగస్టర్స్ అందరూ ఐపీఎల్ వేలంతో రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతున్నారు. సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. తాజాగా జెడ్డా వేదికగా జరిగిన మెగావేలంలో పలువురు అనామక ఆటగాళ్ళు సైతం జాక్ పాట్ కొట్టేశారు. ఊహించినట్టుగానే బిహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. వేలంలో అమ్ముడైన పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. స్కూల్ స్థాయి నుంచే మెరుపులు మెరిపిస్తూ ఈ ఏడాది ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి, అండర్ 19 టీమ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వైభవ్ సూర్యవంశీ కోసం ఫ్రాంచైజీలు హోరాహోరీగా తలపడ్డాయి. 13 ఏళ్ళ వైభవ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ బిడ్డింగ్ లో గట్టిగానే ప్రయత్నించాయి. 30 లక్షల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చిన వైభవ్ రేటు పెరుగుతూ పోయింది. చివరికి కోటీ 10 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ ఈ యువ క్రిెకెటర్ ను దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతిపిన్న వయస్కుడిగా వైభవ్ ఘనత సాధించాడు.
బీహార్‌లోని తాజ్‌పూర్ గ్రామంలో 2011లో జన్మించిన వైభవ్ నాలుగేళ్ళ వయస్సులోనే బ్యాట్ పట్టాడు. క్రికెట్ పట్ల అతని మక్కువను చూసి ఆశ్చర్యపోయిన తండ్రి సంజీవ్.. కుమారుడి కోసం సొంత ఆట స్థలాన్ని నిర్మించారు. ఇరుగుపొరుగు వారితో కలిసి అక్కడ ప్రాక్టీస్ చేసేవాడు. వైభవ్ ను ఎనిమిదేళ్ళు వయస్సులో క్రికెట్ అకాడమీలో చేర్పించాడు. అక్కడ రెండున్నరేళ్ల ట్రైనింగ్ అనంతరం పదేళ్లకే అండర్ 16 క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. పదేళ్ల వయస్సులోనే వైభవ్.. బీహార్ అంతటా వివిధ స్థానిక టోర్నమెంట్లలో ఆడుతూ ఔరా అనిపించాడు. వినూ మన్కడ్ ట్రోఫీలోనూ 5 మ్యాచ్‌ల్లో 400కు పైగా పరుగులు చేశాడు. బీహార్ బోర్డు దృష్టిలో పడిన వైభవ్ ఈ ఏడాది ప్రారంభంలో బీహార్ రాష్ట్రం తరుపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు.
అనంతరం భారత అండర్19 టీమ్‌కి ఎంపికైన వైభవ్ ఆస్ట్రేలియాపై హాఫ్ సెంచరీ చేసి అతి పిన్న వయసులో అంతర్జాతీయ హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లోనూ ఆడుతున్నాడు. 12 ఏళ్ల 284 రోజుల వయసులో రంజీ ట్రోఫీలో ఆరంగ్రేటం చేసిన వైభవ్ సూర్యవంశీ, ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో మొదటి మ్యాచ్ ఆడిన నాలుగో క్రికెటర్‌గా నిలిచాడు. ఇపుడు ఐపీఎల్ వేలంలో ఎంట్రీ ఇవ్వడమే కాదు కోటిరూపాయలకు పైగా ధర పలికి చరిత్ర సృష్టించాడు.