Vaishnavi Chaitanaya: బేబి హీరోయిన్ కి ఛాన్సులు లేవు.. కారణం తెలుసా
వైష్ణవి చైతన్యకు అవకాశాలు ఇవ్వని స్టార్ హీరోలు. మరి ఇప్పుడేం చేస్తోంది.
బేబి సినిమాతో తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్య స్టార్ అవుతుందనుకున్నారు. అందరూ ప్రశంసలు కురిపించారేగానీ.. ఛాన్స్ ఇవ్వడానికి మాత్రం ఇష్టపడడం లేదు. పెర్‌ఫార్మర్‌గా నిరూపించుకున్నా.. స్టార్స్ పక్కన చోటెందుకు దక్కలేదన్నది ఇప్పుడు పెద్ద చర్చ. వైష్ణవి చైతన్య పెద్ద సినిమాల్లో నటించినా రాని గుర్తింపు బేబి తీసుకొచ్చింది. ‘అల వైకుంఠపురంలో’ బన్నీ చెల్లిగా.. వరుడు కావలెను.. టక్ జగదీశ్‌లో నటించినా ఎవరూ పట్టించుకోలేదు. బేబి సినిమా ఛాన్స్ వైష్ణవి కెరీర్‌ను మార్చేసింది.
బేబి సక్సెస్‌కు దర్శకుడు సాయి రాజేశ్ కథ.. స్క్రీన్‌ప్లే మెయిన్ రీజన్ అయితే.. ఆ నెక్ట్స్ ప్లేస్ వైష్ణవి చైతన్య పెర్‌ఫార్మెన్స్‌దే. స్టార్ హీరోలు ఒకరేంటి.. తెలుగు ఇండస్ట్రీ ఫిదా అయిపోయింది. తెలుగువాళ్లు హీరోయిన్స్‌గా రావాలని బన్నీ కోరాడు. వైష్ణవి చైతన్య యాక్టింగ్‌ను అందరూ మెచ్చుకున్నా.. స్టార్స్ నుంచి మాత్రం పిలుపు రావడం లేదు. బేబి తర్వాత యంగ్ హీరోలతో జత కడుతూ బిజీ అయిపోతోంది. బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో సిద్దు జొన్నలగడ్డతో నటిస్తోంది. ఆశిష్ కొత్త సినిమాలో ఈ అమ్మడి పేరే వినిపిస్తున్నా.. ఈ తెలుగు అమ్మాయి స్టార్ అయ్యే ఛాన్స్ స్టార్స్ ఇవ్వడం లేదు. గ్లామర్ రోల్స్‌కు సూట్ కాదని లెక్కలు వేస్తున్నారా? బేబి క్యారెక్టర్ ఎఫెక్ట్ పడుతుందని భయపడుతున్నారోగానీ ఈతెలుగమ్మాయిని దూరంగా పెడుతున్నారు.