Nagababu vs Rgv : వర్మ గారు మీరు బతికే ఉన్నారా.. ఆర్జీవీని ఆడుకున్న నాగబాబు..

వ్యూహం సినిమా విషయంలో తలెత్తిన గొడవలో నాగబాబు, రామ్‌గోపాల్‌ వర్మ మధ్య పోస్ట్‌ల వార్‌ కంటిన్యూ అవుతోంది. ఆర్జీవీ తల నరికి తెస్తే కోటి రూపాయల ఇస్తానంటూ కొలికపూడి చేసిన వ్యాఖ్యలపై ఆర్జీవీ పోలీస్‌ కంప్లైంట్‌ ఇచ్చాడు. చంద్రబాబు, పవన్‌ కొలికపూడికి మద్దతు తెలుపుతున్నారంటూ కామెంట్‌ చేశాడు. ఈ వ్యాఖ్యలపై నాగబాబు సోషల్‌ మీడియాలో రియాక్ట్‌ అయ్యాడు. హీరో విలన్‌ కొట్టుకుంటే కమెడియన్‌ను ఎవరూ చంపరు భయపడకూ అంటూ పోస్ట్‌ చేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 29, 2023 | 05:51 PMLast Updated on: Dec 30, 2023 | 1:26 PM

Varma Garu Are You Alive Nagababu Who Played Rgv

వ్యూహం సినిమా విషయంలో తలెత్తిన గొడవలో నాగబాబు, రామ్‌గోపాల్‌ వర్మ మధ్య పోస్ట్‌ల వార్‌ కంటిన్యూ అవుతోంది. ఆర్జీవీ తల నరికి తెస్తే కోటి రూపాయల ఇస్తానంటూ కొలికపూడి చేసిన వ్యాఖ్యలపై ఆర్జీవీ పోలీస్‌ కంప్లైంట్‌ ఇచ్చాడు. చంద్రబాబు, పవన్‌ కొలికపూడికి మద్దతు తెలుపుతున్నారంటూ కామెంట్‌ చేశాడు. ఈ వ్యాఖ్యలపై నాగబాబు సోషల్‌ మీడియాలో రియాక్ట్‌ అయ్యాడు. హీరో విలన్‌ కొట్టుకుంటే కమెడియన్‌ను ఎవరూ చంపరు భయపడకూ అంటూ పోస్ట్‌ చేశాడు. ఆ పోస్ట్‌కు వర్మ రిప్లై ఇచ్చాడు. నాకంటే నా సినిమాలో మీరు పెద్ద కమెడీయన్‌. మీ తమ్ముడి దగ్గర టీకి డబ్బులు అడుక్కుని టీ తాగండి అంటూ రిప్లై ఇచ్చాడు. ఆ రిప్లైకి కౌంటర్‌ రిప్లై ఇస్తూ మరో పోస్ట్‌ పెట్టాడు నాగబాబు. వర్మ, మీరు నా పోస్ట్‌కి స్పందించినందుకు చాలా సంతోషంగా ఉంది.. కొంచెం షాక్‌కి కూడా గురయ్యా. ఎందుకంటే మీరు చనిపోయి దాదాపు 20 ఏళ్లు దాటింది. ఇంకా బతికున్నాను అనుకుని తిరుగుతున్నారు. కానీ మీ ఆత్మ మాత్రమే తిరుగుతోందని గ్రహించాలి. ఎనీ హౌ ఏదో ఓక రూపంలో నా పోస్టుకి సమాధానం ఇచ్చినందుకు సంతోషం. ఎప్పటికి మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. కీర్తిని కోల్పోయిన కీర్తిశేషులు వర్మ గారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ నాగబాబు సెటైరికల్‌ పోస్ట్‌ పెట్టాడు.. మరి దీనికి వర్మ ఎలాంటి కౌంటర్ ఇస్తాడో వేచి చూడాలి. ఇక ఇది చూసిన నెటిజన్స్.. వీళ్ల మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలు అయిందంటూ కామెంట్స్ పెడుతున్నారు.