Vemireddy Prabhakar Reddy: జగన్‌కి ఝలక్.. 23న టీడీపీలోకి వేమిరెడ్డి
ఇప్పటికే నెల్లూరు జిల్లాలో చాలామంది నేతలు వైసీపీకి గుడ్ బై కొట్టారు. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి కూడా వెళ్ళిపోతుండటంతో జిల్లా వైసీపీ కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. నెల్లూరు ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఆయన భార్య, టీటీడీ మెంబర్ ప్రశాంతి వైసీపీకి రిజైన్ చేస్తున్నారు.

Vemireddy Prabhakar Reddy: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగలనుంది. నెల్లూరు జిల్లాలో వైసీకి కీలకంగా ఉన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి రిజైన్ చేస్తున్నారు. ఆయన భార్య ప్రశాంతితో కలసి ఈనెల 23న టీడీపీలో చేరుతున్నారు. ఇవాళ, రేపట్లో ఈ ఇద్దరూ అధికారికంగా వైసీపీ సభ్యత్వానికి రాజ్యసభ పదవికి రాజీనామా చేయబోతున్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో చాలామంది నేతలు వైసీపీకి గుడ్ బై కొట్టారు. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి కూడా వెళ్ళిపోతుండటంతో జిల్లా వైసీపీ కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. నెల్లూరు ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఆయన భార్య, టీటీడీ మెంబర్ ప్రశాంతి వైసీపీకి రిజైన్ చేస్తున్నారు.
BJP DEMANDS TDP: చంద్రబాబు పాట్లు.. ఇస్తావా.. చస్తావా! బాబుకు బీజేపీ హుకుం
పార్టీ అధినేత జగన్ తో విభేదాలతో గత నెల రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు వేమిరెడ్డి. నెల్లూరు జిల్లాలో వైసీపీకి 2019లో 10 సీట్లు గెలిపించడంలో వేమిరెడ్డిదే కీలక పాత్ర. రాజ్యసభసభ్యుడిగా ఉన్న ఆయన్ని ఈసారి నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీకి నిలబెట్టాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. వేమిరెడ్డి ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. కానీ తన ఎంపీ నియోజకవర్గ పరిధిలో కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చాలని వేమిరెడ్డి సూచనలు చేశారు. నెల్లూరు సిటీ, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను మార్చాలని అధిష్టానాన్ని కోరారు. కానీ అందుకు జగన్ ఒప్పుకోలేదు. దాంతో మనస్థాపం చెందారు వేమిరెడ్డి. ఆయన్ని బుజ్జగించేందుకు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పార్టీలో తనకు అవమానాలు ఎదురవుతున్నాయనీ.. నెల్లూరు లోక్‌సభ పరిధిలో జరిగే పరిణామాలపై కనీసం సమాచారం కూడా ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు వేమిరెడ్డి. నెల రోజులుగా వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న వేమిరెడ్డి.. టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
కొన్నిరోజులుగా చెన్నైలోనే మకాం పెట్టిన ఆయన.. బుధవారం నెల్లూరులో తన అనుచరులతో సమావేశమయ్యారు. వైసీపీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించారు. అయితే కొందరు వైసీపీ ముఖ్యనేతలు మరోసారి వేమిరెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీని వదలవద్దనీ.. అభ్యర్దుల విషయంలో జగన్‌తో మరోసారి చర్చించాలని సూచించారు. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోరారు. అయితే, వేమిరెడ్డి మాత్రం అందుకు సిద్దంగా లేరని సమాచారం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికీ.. ఆయన భార్య ప్రశాంతి టీటీడీ బోర్డుకు రాజీనామా చేయబోతున్నారు. ఈనెల 23న టీడీపీలో చేరతారని తెలుస్తోంది. వీళ్ళతో పాటు కొందరు వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా తెలుగుదేశంలో చేరుతున్నారు. నెల్లూరు లోక్ సభ సీటును వేమిరెడ్డికి, ఎమ్మెల్యే సీటు ఆయన భార్య ప్రశాంతికి ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించినట్టు చెబుతున్నారు.