Venuswamy Nishvika : వేణు స్వామిని ఇక వదిలిపెట్టరా? మరో హీరోయిన్ పూజలు
హీరోయిన్ల దరిద్రమో... వేణు స్వామి (Venu Swamy) అదృష్టమో గానీ... జ్యోతిష్యంలో ఎన్ని తప్పులు చెప్పినా... అయ్యో సారీ అని ఎన్ని సార్లు నాలుక మడతేసినా... ఇంకా వేణు స్వామి దగ్గరే పూజలు చేయించుకుంటున్నారు.

Venu Swami will not leave? Another heroine Poojalu
హీరోయిన్ల దరిద్రమో… వేణు స్వామి (Venu Swamy) అదృష్టమో గానీ… జ్యోతిష్యంలో ఎన్ని తప్పులు చెప్పినా… అయ్యో సారీ అని ఎన్ని సార్లు నాలుక మడతేసినా… ఇంకా వేణు స్వామి దగ్గరే పూజలు చేయించుకుంటున్నారు. ఏపీలో జగన్ (YS Jagan) కి తిరుగులేదు… మళ్ళీఅధికారంలోకి వస్తాడంటూ… తప్పుడు జ్యోతిష్యం చెప్పి… ఈమధ్యే చెంపలేసుకున్నాడు వేణుస్వామి. జగన్ గెలుపుపై జోస్యం చెప్పిన ఆయన్ని… వైసీపీ (YCP), టీడీపీ (TDP) అభిమానులు, నెటిజన్లు ఓ రేంజ్ లో ఏసుకున్నారు. దాంతో నేను ఇక జ్యోతిష్యం చెప్పను… తప్పయిపోయింది అని లెంపలేసుకున్నాడు వేణుస్వామి. సెలబ్రిటీల జాతకాల విషయంలో వేణుస్వామి గాల్లో రాయి వేస్తాడు. తగిలిందా అదృష్టం… తగలలేదో… నాలుక తిప్పేస్తాడు… ఇక పొలిటికల్ లీడర్ల విషయంలో వేణు స్వామి చెప్పింది ఒక్కటీ నిజం కాలేదు.
వేణుస్వామి జాతకాలు ఫెయిల్ అవుతున్నాయని తెలిసినా… పిచ్చి సెలబ్రిటీలు (Celebrities) ఇంకా ఆయన చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఆ మధ్య డింపుల్ హయతి, రష్మిక, నిధి అగర్వాల్ లాంటి హీరోయిన్లు… వేణు స్వామికి తమ జాతకాలు చూపించుకున్నారు. ఆ తర్వాత జాతకంలో దోష నివారణకు పూజలు కూడా చేయించుకున్నారు. జగన్ వ్యవహారం బయటకు వచ్చాక… రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్లకు… వేణుస్వామి జాతకం ఏంటో తెలిసిపోయింది. అయితే ఇంకా కన్నడ ఇండస్ట్రీకి ఈ విషయం తెలియదో ఏమో… లేటెస్ట్ గా కన్నడ హీరోయిన్ నిశ్విక… వేణుస్వామి దగ్గర పూజ చేయించుకున్న ఫోటోలు బయటకు వచ్చాయి. 2018లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ… కన్నడంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. మరి ఆమెకు ఏం పూనిందో ఏమో… వేణుస్వామి దగ్గర పూజలు చేయించుకుంది. ఇది చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవని తెలుసు… అలాగే వేణుస్వామి చెప్పిన జాతకమేది కరెక్ట్ కాదనీ తెలుసు… మరి ఎందుకు పిచ్చిగా ఎగబడుతున్నారో… ఆ సెలబ్రిటీలకే తెలియాలి.