Congress MLA List: తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థులు తొలి లిస్ట్ విడుదల
ఎట్టకేలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది కాంగ్రెస్.

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మొదలు అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు సిద్దమైయ్యాయి. షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ నేడు మ్యానిఫెస్టో కూడా విడుదలకు సిద్దమైంది. అయితే కాంగ్రెస్ మాత్రం పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం బెటర్ అని భావించిందో ఏమో తాజాగా 55 మంది అభ్యర్థుల తో తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో చాలా మంది సీనియర్ నాయకులకు చోటు కల్పించింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న వారికి కూడా ఇందులో అవకాశం లభించింది. ఈ జాబితాను కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. సుదీర్ఘ చర్చల తరువాత స్క్రీనింగ్ కమిటీ వీరిని ఫైనల్ చేసింది. అందులో ఎవరెకవరు ఉన్నారో, ఎన్ని నియోజక వర్గాలు కవర్ అయ్యాయో ఇప్పుడు చూద్దాం.
ముఖ్యమైన నాయకులు – నియోజకవర్గాలు..
- కొడంగల్ – రేవంత్ రెడ్డి
- నల్గొండ – కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
- జగిత్యాల్ – జీవన్ రెడ్డి
- మెదక్ – మైనంపల్లి రోహిత్ రావు
- సంగా రెడ్డి – జగ్గారెడ్డి
- మల్కాజ్ గిరి – మైనంపల్లి హనుమంత రావు
- నాంపల్లి – ఫిరోజ్ ఖాన్
- గోషామహల్ – సునీత
- కొల్లాపూర్ – జూపల్లి కృష్టారావు
- హుజూర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ములుగు – సీతక్క
- మధిర – బట్టి విక్రమార్క
కాంగ్రెస్ ప్రకటించిన తొలిజాబితాలోని అభ్యర్థులు వీళ్లే..
T.V.SRIKAR