PRABHA VENUSWAMY : ప్రభాస్ జాతకంపై.. వేణుస్వామి మళ్ళీ కామెంట్స్

సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి చెప్పే జ్యోతిష్యుడు (astrologer) వేణుస్వామి (Venuswami) మరోసారి ప్రభాస్ జాతకం మీద చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ప్రభాస్ జాతకం బాగోలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 9, 2024 | 07:30 PMLast Updated on: Apr 09, 2024 | 7:30 PM

Venuswami Again Comments On Prabhas Horoscope

సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి చెప్పే జ్యోతిష్యుడు (astrologer) వేణుస్వామి (Venuswami) మరోసారి ప్రభాస్ జాతకం మీద చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ప్రభాస్ జాతకం బాగోలేదు. ఆయనతో సినిమాలు చేస్తున్న నిర్మాతలంతా… మీ జాతకాలు చూపించుకోండి అంటూ గతంలో కామెంట్ చేశారు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ వేణుస్వామిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ప్రభాస్ విషయంలో ప్రతిసారీ ఏదో ఒక కామెంట్ చేయడం… అభిమానులు మండిపడటం కామన్ అయింది. కానీ ఇప్పుడు ప్రభాస్ పెద్దమ్మ, దివంగత నటుడు కృష్ణంరాజు భార్య శ్యామలను టార్గెట్ చేశాడు వేణుస్వామి.

ప్రభాస్ జాతకం గురించి వేణుస్వామి (Venu Swamy) చెప్పడంపై ప్రభాస్ పెద్దమ్మ ఈమధ్య రియాక్ట్ అయ్యారు. ప్రభాస్ జాతకం అసలు నా దగ్గరే లేదు… వేణుస్వామి దగ్గర ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు. ఆయన ప్రచారం కోసమే అలా చెప్పుకుంటున్నారని కూడా అన్నారామె. లేటెస్ట్ గా వేణుస్వామి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్యామల కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు. ప్రభాస్ కీ… ఆయన పెద్దమ్మకీ సంబంధం లేదు… చాలా మంది బంధువులు అని చెబుతారు గానీ… అంటూనే వాళ్ళ వ్యక్తిగత విషయాల చెప్పదలుచుకోలేదని ట్విస్ట్ ఇచ్చారు.

పెద్దమ్మ అయితే మాత్రం అన్నీ తెలుస్తాయా అంటున్నారు వేణుస్వామి. ప్రభాస్ తల్లికి మాత్రమే తాను ఇంపార్టెన్స్ ఇస్తానని అంటున్నాడు వేణుస్వామి. అంతేకాదు… ప్రభాస్ జాతకం తన దగ్గరకు వచ్చిందనీ… అది చూసే చెప్పానంటున్నారు. అయితే ఎవరి ద్వారా జాతకం వచ్చిందనేది మాత్రం సీక్రెట్… బయటపెట్టను అంటున్నాడు. కృష్ణంరాజు భార్య శ్యామల కూడా తన దగ్గరకు వచ్చినట్టు కూడా వేణుస్వామి చెప్పారు. ప్రభాస్ విషయంలో కాదనీ… కృష్ణంరాజు… గవర్నర్ అవుతారా లేదా అని విషయం తెలుసుకోడానికి ఆమె వచ్చినట్టు వివరించారు. ఇప్పుడేమో నేను ఎవరో తెలియనట్టు శ్యామల మట్లాడుతున్నారనీ… అది కరెక్ట్ కాదంటున్నాడు వేణుస్వామి.

గతంలో ప్రభాస్ జాతకం బాగోలేదనీ… సినిమాలు ప్లాఫ్ అవుతాయని వేణుస్వామి చెప్పాడు. ఆయన చెప్పినట్టే సాహో, రాధేశ్యామ్ డిజాస్టర్లుగా మిగిలాయి. ఆ తర్వాత ఆదిపురుష్ కూడా బాహుబలి రేంజ్ లో హిట్ అవ్వదనీ… మామూలు సినిమాలాగే ఉంటుందన్నాడు. అన్నట్టే జరిగాయి. దాంతో ప్రభాస్ గురించి వేణుస్వామి ఏది మాట్లాడినా… అది నిజమైపోతుందని ఆయన ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు.